Site icon NTV Telugu

Rukmini Vasanth : టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌కు రుక్మిణీ వసంత్ గట్టి పోటీ.. సుకుమార్ సినిమాలో ఛాన్స్ ఎవరికో?

Janvi Kapoor, Rukmini Vasanth

Janvi Kapoor, Rukmini Vasanth

టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల రేసు రసవత్తరంగా మారింది. భాషతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ ‘దేవర’తో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ సినిమాలో నటిస్తోంది. ‘దేవర’లో గ్లామర్‌కే పరిమితమైనా, రామ్ చరణ్ సినిమాతో తన నటనను నిరూపించుకోవాలని జాన్వీ ఆరాటపడుతోంది. అయితే, ఇప్పుడు జాన్వీ కి గట్టి పోటీనిస్తూ కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ రేసులోకి వచ్చింది. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రంతో రుక్మిణి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ‘సప్త సాగరదాచె ఎల్లో’ సినిమాతో కుర్రాళ్ల మనసు దోచుకున్న ఈ భామ, ఇప్పుడు టాప్ డైరెక్టర్ల కళ్లలో పడింది.

Also Read : Kalyani Priyadarshan : మలయాళ బ్యూటీకి హిందీ ఛాన్స్..

రుక్మిణీ వసంత్ రీసెంట్‌గా ‘కాంతార: చాప్టర్ 1’లో కనకవతి పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించింది. ఆమె అందం, అభినయం చూసి టాలీవుడ్ మేకర్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాబోతున్న RC17 కోసం రుక్మిణి పేరును పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీలో గట్టి ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బుచ్చిబాబు దర్శకత్వంలోని ‘పెద్ది’లో జాన్వీ నటిస్తుండగా, అదే వరుసలో రుక్మిణికి కూడా చరణ్ సరసన ఛాన్స్ వస్తే జాన్వీకి ఈమె గట్టి పోటీదారుగా మారడం ఖాయం. అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటున్న ఈ ‘కనకవతి’కి సుకుమార్ గనుక ఛాన్స్ ఇస్తే టాలీవుడ్‌లో ఆమె రేంజ్ మరో లెవల్‌కు చేరుతుంది.

Exit mobile version