Rudraprayag Accident: 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అలకనంద నదిలో బోల్తా

  • అలకనంద నదిలో బస్సు బోల్తా
  • 26 మంది ప్రయాణికులు ఉన్నట్లు అనుమానం
  • సహాయక చర్యల్లో పోలీసులు
New Project (79)

New Project (79)

Rudraprayag Accident: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఇక్కడ ఓ టెంపో ట్రావెలర్ అలకనంద నదిలో పడిపోయింది. అందులో 26 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం రుద్రప్రయాగ నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో బద్రీనాథ్ హైవేపై రైటోలి సమీపంలో అలకనంద నదిలో టెంపో ట్రావెలర్ పడిపోయింది. వాహనంలో 26 మంది ప్రయాణికులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసు యంత్రాంగం, జిల్లా విపత్తు నిర్వహణ, డీడీఆర్‌ఎఫ్ తదితర బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి.