Bihar: ముక్క చుక్క ఉందంటే చాలు మూలకు పడ్డ ముసలోడు కూడా ఎగేసుకొచ్చేస్తారు.. మనోళ్లకు ఉన్న పాడు అలవాటు అది. వెనక ముందు చూసుకోకుండా వచ్చేయడమే. బీహార్లో కూడా మటన్ తో భోజనం అనే సరికి భారీగా జనం తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఆ రాష్ట్రంలో ఓ ఎంపీ కార్మికుల కోసం మటన్ రైస్‌తో ఏర్పాటు చేసిన విందుకు భారీగా వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో వారి అదుపు చేయడానికి ప్రయత్నిస్తుండగా డీఎస్పీ కిందపడ్డారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.
Read Also:What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ముంగేర్ జిల్లాలోని పోలో గ్రౌండ్‌లో జేడీయూ జాతీయాధ్యక్షుడు, ముంగేర్ ఎంపీ లాలన్ సింగ్ రోజు పనిచేసుకునే కూలీల కోసం మటన్ తో కమ్మనైన విందును ఏర్పాటు చేశారు. మటన్ రైస్‌ను తినేందుకు ప్రజలు పెద్దఎత్తున అక్కడికి తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. దీంతో రద్దీని అదుపు చేసే సమయంలో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వారిపై లాఠీలు ఝులిపించారు. విందులో కూలీల కోసం ప్రత్యేకంగా కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు.
Read Also:KKR vs CSK: ప్రతీకారం తీర్చుకున్న కేకేఆర్.. సీఎస్కేపై ఘనవిజయం
ఈ క్రమంలో కొందరు జేడీయూ పార్టీ కార్యకర్తలు అక్కడికి రావడం వల్ల మొదట తోపులాట జరిగింది. అయితే కేవలం రెండు వేల మంది కార్మికుల కోసం ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమానికి అంతకు మించి ప్రజలు రావటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని నిర్వాహకులు చెబుతున్నారు. మొదటి పంక్తి భోజనం ప్రశాంతంగా ముగిసినా రెండో రౌండ్ సమయానికి జనాలు కిక్కిరిసి పోవడం వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత లాలన్ సింగ్ ఇలాంటి విందులు చాలా ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా ఈ మధ్య కాలంలో ఆ కార్యక్రమానికి బ్రేక్ పడింది. మహమ్మారి ముప్పు తగ్గడం వల్ల ఈసారి ముంగేర్ వేదికగా మరోసారి ఏకంగా రెండు వేల మంది కోసం విందు ఏర్పాటు చేశారు.
जेडीयू अध्यक्ष ललन सिंह की मटन पार्टी में कार्यकर्ताओं को मिली लाठी!
JDU के राष्ट्रीय अध्यक्ष और मुंगेर सांसद ललन सिंह ने महागठबंधन के कार्यकर्ताओं के सम्मान में पोलो मैदान में मटन-पुलाव महाभोज का आयोजन किया। इस दौरान जमकर हंगामा हुआ। भोज खाने के लिए आई भीड़ को नियंत्रित करने के… pic.twitter.com/8e1MowYz28
— Bihar Tak (@BiharTakChannel) May 14, 2023
