Alert.. Alert: తెలంగాణ ప్రజలు పగటి పూట పనుల మీదూ, పండుగ పూట ఊరెళ్లాలనే ప్రణాళికలలో బిజీగా ఉన్న ఈ సమయంలో… ఒక్కసారిగా ఒక బిగ్ అలర్ట్ వచ్చింది. “బస్సులు బంద్!”.. అవును, ఈ అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా RTC బస్సులు ఆగిపోనున్నాయి. జనజీవనం స్తంభించనున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్‌కి ఇది భలే ఛాన్స్… రెట్లు రేట్లతో డబ్బు దండుకునే సమయం వచ్చేసింది. గతంలో ఎన్నోసారి చూసిన దృశ్యం మళ్లీ రిపీట్ కానుంది. ప్రయాణికుల జేబులు ఖాళీ అయ్యే ప్రమాదం ఖాయం..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) కార్మికులు మే 7 నుంచి సమ్మెకు దిగనున్నట్లు RTC జేఏసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న హైదరాబాదులోని బాగ్‌లింగంపల్లిలోని కళాభవన్ నుంచి బస్‌భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిమంది ఉద్యోగులు పాల్గొన్న ఈ ర్యాలీలో, తమ సమస్యలను ప్రభుత్వానికి ఎన్నోసార్లు చెప్పినా స్పందన లేకపోవడంతో సమ్మె తుదిపరిష్కారంగా మిగిలిందని జేఏసీ ఛైర్మన్ వెంకన్న గళమెత్తారు. అయితే.. ఈ ర్యాలీకి ముందస్తు అనుమతులు లేకున్నా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్‌భవన్ చుట్టుపక్కల భద్రత పెంచడంతోపాటు, ఎవరిని లోపలికి అనుమతించలేదు. సమ్మెకు ఇంకో రోజు మాత్రమే మిగిలి ఉండటంతో, ప్రభుత్వం ఇంకా స్పందించలేదనే పరిస్థితి ప్రజల్లో, ఉద్యోగుల్లో ఉత్కంఠను పెంచుతోంది.
HYDRA : మరోసారి హైడ్రా భారీ కూల్చేతలు.. ఈ సారి గచ్చిబౌలిలో
దీనిపై RTC యాజమాన్యం కూడా స్పందిస్తూ.. ఓ భావోద్వేగ భరిత బహిరంగ లేఖను ఉద్యోగులకు పంపించింది. సంస్థ ప్రగతి మార్గంలో ఉన్న ఈ తరుణంలో సమ్మె అనేది పూర్తిగా ప్రమాదకరమని, ఇది తిరిగి సంస్థను దిక్కుతెలియని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించింది. “తల్లి లాంటి RTCని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది” అంటూ సున్నితంగా విజ్ఞప్తి చేసింది. 2019లో జరిగిన సమ్మె బాధ్యతను గుర్తు చేస్తూ, ఇప్పుడు సంస్థ ప్రజల్లో విశ్వాసాన్ని సంపాదిస్తున్నదని, ఎలాంటి అవాంఛనీయ చర్యలు తీసుకోకుండా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంకితంగా ఉన్నదని పేర్కొంది. ఉద్యోగుల సంక్షేమమే తమ తొలి కర్తవ్యమని, వచ్చే ప్రతి రూపాయిని వారి వేతనాలు, రాయితీలు, భద్రతకే ఖర్చు చేస్తున్నామని వివరించింది.
అంతేకాకుండా, RTCపై ప్రస్తుతం ఎస్మా చట్టం (ESMA) అమల్లో ఉన్నందున సమ్మెలు నిషేధితమైనవని, చట్టవ్యతిరేకంగా విధులకు ఆటంకం కలిగిస్తే కఠినమైన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. “కొంతమంది స్వార్థ రాజకీయాలకు బానిసలవుతున్నారేమో!” అంటూ ఉద్యోగులను జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ పరిస్థితుల్లో సమ్మె కొనసాగితే రానున్న కొన్ని రోజులు తెలంగాణలో ప్రజల ప్రయాణాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశముంది. మరి ఈ సమ్మెకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఓ పక్క ఉద్యోగుల ఆవేదన, మరోపక్క ప్రజల అవసరాలు.. ఈ సమరానికి ముగింపు ఎక్కడో వేచి చూడాలి..
Tragedy : పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో వధువు మృతి
