Site icon NTV Telugu

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆమోదం

Ts Assembly

Ts Assembly

తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడింది. గత గురువారం ప్రారంభమైన ఈ సమావేశాలు ఆదివారం వరకు కొనసాగాయి. నాలుగు రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో.. పలు అంశాలపై చర్చించారు. ఆదివారం అసెంబ్లీలో తెలంగాణ ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం బిల్లు, పురపాలక చట్ట సవరణ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. టీఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ పువ్వాడ అజయ్‌ కుమార్‌ బిల్లును ప్రవేశపెట్టగా శాసనసభ ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఉద్యోగులు విలీనంతో ప్రభుత్వానికి ఏటా 3 వేల కోట్ల భారం పడుతుందన్నారు. అంతేకాకుండా.. ఆర్టీసీ కార్పొరేషన్‌ ఆస్తులు యధాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు. కార్మికుల బకాయిలు కూడా చెల్లిస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్‌సీ ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుందని చెప్పారు. మరోవైపు ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్పొరేషన్‌ ఆస్తులు యధాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు. కార్మికుల బకాయిలు కూడా చెల్లిస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్‌సీ ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుందని చెప్పారు.

Bholaa Shankar Pre Release LIVE : ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సభ్యులకు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. 2019 జనవరి 18న శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించానని గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్ష, అధికార పక్ష నేతలతో పాటు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అన్ని విధాలుగా సభ క్రమశిక్షణతో నడిచిందని స్పీకర్ పేర్కొన్నారు. ఎనిమిది సెషన్లలో సజావుగా సాగేందుకు, పద్దులపై చర్చించేందుకు, ప్రశ్నలకు జవాబులు ఇప్పించేందుకు సహకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version