NTV Telugu Site icon

Ashwathama: ఆర్టీసీ డిపోలు మూతపడుతూ.. ప్రైవేట్ బస్సులు పెరుగుతున్నాయి..!

Aswaddma

Aswaddma

TSRTC: మూడేళ్ళ తరువాత ఆర్టీసీలో సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడిందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ జరగలేదని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నాయన్నారు. ఆర్టీసీ డిపోలు మూతపడుతూ.. ప్రైవేటు బస్సులు అధికంగా పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిపోల మూసివేతను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. లాభ నష్టాలతో కాకుండా కొత్త బస్సులను పెంచి.. గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు పెంచాలని కోరారు.

Read Also: Biryani: ఈస్ట్ ఆర్ వెస్ట్ “బిర్యానీ” ఈస్ బెస్ట్.. ఏకంగా 7.6 కోట్ల బిర్యానీ ఆర్డర్లు..

మరోవైపు రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులకు అధిక భారం పడుతుందని అశ్వత్థామ ఆరోపించారు. మరోవైపు మహిళా కార్మికులపై పని భారం పెరిగిందని.. మహిళా ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు‌. రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై అన్ని డిపోల్లో పర్యటించి.. వారందర్నీ ఏకతాటికి తీసుకొస్తామన్నారు. కార్మికుల సమస్యలను ఆర్టీసీ ఛైర్మన్‌, ఎండీ దృష్టికి తీసుకెళ్తామని ఆయ తెలిపారు. రాజకీయలకు అతీతంగా ఏర్పడిన జేఏసీలో ఇతర కార్మికులందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.