NTV Telugu Site icon

Mohan Bhagwat: ఆర్‌ఎస్ఎస్ నెక్ట్స్ టార్గెట్ ఇదే.. సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం

Mohan Bhagwat

Mohan Bhagwat

సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ 10 రోజుల బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. నేడు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఆర్‌ఎస్ఎస్ తదుపరి కార్యాచరణపై ఆయన వివరణ ఇచ్చారు. హిందూ సమాజం వైవిధ్యం ఐక్యతలో ఉందని నమ్ముతుందని అన్నారు. సంఘ్ లక్ష్యం హిందూ సమాజాన్ని ఏకం చేయడమే అని స్పష్టం చేశారు. హిందూ సమాజం మరింత ఐక్యంగా ఉండాలని పునరుద్ఘాటించారు. మంచి సమయాల్లోనూ సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.. దానికి సమాజంలోని ప్రజల మధ్య ఐక్యత అవసరమని వెల్లడించారు. ప్రజలు దేశాన్ని పాలించిన చక్రవర్తులు, మహారాజులను గుర్తు పెట్టుకోరని.. తండ్రి వాగ్దానాన్ని నెరవేర్చడానికి 14 ఏళ్లు అజ్ఞాతవాసం చేసిన రాజు(రాముడు)ను గుర్తుంచుకుంటారని అన్నారు.

READ MORE: Delhi: ఢిల్లీ తొక్కిసలాట ఘటన.. పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు

200ఏళ్ల పాటు మన దేశాన్ని సాలించిన బ్రిటిషు వారు దేశ ప్రజలను విడదీయాలని చూశారన్నారు. స్థానిక ప్రజలు దేశాన్ని పరిపాలించడానికి పనికిరారని ప్రచారం చేసి, భారత దేశ చరిత్రను బ్రిటిష్‌ పాలకులు వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల గురించి మోహన్ భగవత్ ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా లక్షల్లో వాలంటీర్లు ఉన్నారని ఆయన అన్నారు. వారు ఎవ్వరి దగ్గరా డబ్బులు తీసుకోరని.. స్వయంగా వారంతట వారే దేశం కోసం పని చేస్తున్నారన్నారు. తాము ఏదో గొప్ప పేరు తెచ్చుకోవడానికి ఇదంతా చేయడం లేదని.. భారతదేశ పురోగతికి అర్థవంతమైన సహకారం అందించడానికి ఇది చేస్తున్నామన్నారు.

READ MORE: Warangal: ఇంటర్ విద్యార్థినితో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. కుటుంబీకుల ఆందోళన

ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్ లో 2021లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. మమతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ శాసనసభ పదవీకాలం 2026 మే 7న ముగియనుంది. అంటే వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వహిస్తారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ వల్లే బీజేపీ గెలుపొందిందని స్పష్టమైంది. దీంతో ఈ నేపథ్యంలో కోల్కతాలో ఈ నెల 16న భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఆరెస్సెస్ సిద్ధమవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. హైకోర్టుకు వెళ్ళి అనుమతులు తెచ్చుకుంది ఆరెస్సెస్. ఈ సభ ఇప్పుడు కీలకంగా మారనుంది.