NTV Telugu Site icon

Love Jihad: లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ముంబైలో భారీ ప్రదర్శన

Love Jihad

Love Jihad

Love Jihad: ల‌వ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ముంబైలో వేలాదిమంది రోడ్లపై భారీ ప్రదర్శన చేపట్టారు. ముస్లింలు హిందువుల భూములను అక్రమంగా ఆక్రమించుకోవడం, హిందూ యువతులను ప్రేమ పేరుతో తీసుకెళ్లి, మతం మార్చుతుండటంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. అనేక హిందూ సంస్థలు, వాటి మద్దతుదారులు, సాధారణ ప్రజానీకం ఆదివారం ఉదయం శివాజీ పార్క్ వద్ద తమ నిరసన గళాన్ని వినిపించారు. వీరిలో బాలలు కూడా ఉన్నారు. సకల హిందూ సమాజం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మీనాతాయ్ థాకరే విగ్రహం నుంచి ప్రభాదేవి కామ్‌గార్ మైదానం వరకు ఈ ప్రదర్శన జరిగింది. లవ్ జీహాద్, ల్యాండ్ జీహాద్‌లకు వ్యతిరేక నినాదాలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులను మేలుకొలిపే నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు.

Read Also: Water Tax: భూమిలోని నీటిని తోడితే ట్యాక్స్ కట్టాల్సిందే.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

హిందూ జ‌న ఆక్రోశ్ మోర్చా పేరుతో ర్యాలీ చేప‌ట్టారు. దాద‌ర్‌లోని శివాజీ పార్క్ నుంచి పార్లేలోని కామ్‌గ‌ర్ మైదాన్ వ‌ర‌కు సుమారు 4 కిలోమీట‌ర్ల మేర ప్రదర్శన జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవ‌క్ సంఘ్‌, భ‌జ‌రంగ్ ద‌ళ్‌, విశ్వహిందూ ప‌రిష‌త్ కార్యకర్తలు ఈ ర్యాలీ నిర్వహించారు. సీఎం ఏక‌నాథ్ షిండేతో పాటు బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కొంద‌రు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చాయని, మహారాష్ట్రలో కూడా అటువంటి చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. కొందరు నిరసనకారులు మాట్లాడుతూ, హిందువులను వేధించి, చట్టవిరుద్ధంగా భూములను సొంతం చేసుకుంటున్నారన్నారు. అస్సాంను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో స్థానిక జనాభాలో వారి సంఖ్యాబలాన్ని పెంచుకోవడం కోసం భూములను లాక్కుంటున్నారన్నారు. మహారాష్ట్రలో కూడా చట్టవిరుద్ధంగా నిర్మిస్తున్న మసీదులు, ఇతర నిర్మాణాలు ల్యాండ్ జీహాద్‌కు సంకేతాలని తెలిపారు. దీనిపై తాము ప్రజలను మేలుకొలుపుతున్నామని చెప్పారు.