Site icon NTV Telugu

R.S Praveen Kumar : అందుకే.. కేటీఆర్‌పై కేసులు

Rs Praveen Kumar

Rs Praveen Kumar

R.S Praveen Kumar : తెలంగాణలో రాజకీయ వేడి మరోసారి పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులు పెడుతూ ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని బీఎస్పీ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్ ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారని, అలాంటి నేతపై కుట్రపూరితంగా కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు.

ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఇప్పటివరకు కేటీఆర్‌పై 14 కేసులు పెట్టారని, इनमें నాలుగు కేసులను ఇప్పటికే హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. “ఏసీబీ కార్యాలయం నుంచి తెలంగాణ భవన్‌కు నడిచి వచ్చినందుకు కూడా ఆయనపై కేసు పెట్టారు. ఇదంతా ప్రత్యర్థి పార్టీ చేసే పనులు కాదు. ఇది రాజకీయ ద్వేషానికి నిదర్శనం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ ప్లాట్‌ఫారంపై నిలబెట్టేందుకు కేటీఆర్ తెచ్చిన ఫార్ములా ఈ రేస్ పైనూ దుష్ప్రచారం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. “ఫార్ములా ఈ రేస్ లో ఏ అవినీతి జరగలేదని స్పష్టం చేస్తున్నాం. కేటీఆర్‌ వ్యక్తిగత ఖాతాలో ఒక్క రూపాయా వెళ్లలేదని అధికారికంగా తేలింది. నగరానికి పెట్టుబడులు రావాలని, పేరు ప్రఖ్యాతులు పెరగాలని తీసుకొచ్చిన ఈ రేస్‌పై అప్రతిష్ట కలిగించేలా వ్యవహరిస్తున్నారు” అని విమర్శించారు.

Health Benefits of Jamun: నేరేడు పండ్ల వల్ల ఎన్ని లాభాలో తెలుసా? అస్సలు మిస్ అవ్వొద్దు..

ప్రస్తుత ప్రభుత్వం విపక్ష నేతలను అణచివేయాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ‘ఓటుకు నోటు’ కేసులో ఉన్న వ్యక్తిని సీఎంగా చూశామంటే దొంగ చేతికి ఇంటి తాళాలు ఇచ్చినట్లే అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

“ఆదిలాబాద్‌లో కొనతం దిలీప్‌పై కేసులు, సీక్రెట్ ఎఫ్.ఐ.ఆర్‌లు ఈ ప్రభుత్వం ఎలా పని చేస్తుందో చూపిస్తున్నాయి” అని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ప్రస్తుత పాలనపై ప్రజల్లో అంగీకారం లేదని, ఇలా నిరుద్దేశంగా నేతలపై కేసులు పెడితే ప్రజలే సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు.

Israel Iran War: ఇరాన్‌లో 80 మంది మృతి.. గగనతలం మూసేసిన ఇజ్రాయిల్..

Exit mobile version