సిర్పూర్ నియోజకవర్గ వర్గంలోని పోలీసులు ఏకపక్షంగా వవ్యహరిస్తున్నారు అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. జిల్లా ఎస్పీ మీద మాకు నమ్మకం లేదు.. ఎల్లెక్షన్లు సజావుగా జరగాలంటే జిల్లా ఎస్పీతో పాటు కాగజ్ నగర్ డీఎస్పీ, సీఐని ఇక్కడి నుండి బదిలీ చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేసేందుకు రెడీగా ఉన్నాం.. నిన్న రాత్రి జరిగిన బీఎస్పీ ప్రచార సభను బీఆర్ఎస్ ప్రచార రథం సౌండుల మోతలతో మాకు ఆటంకం కలిగించి.. మా పైనే కేసులు పెట్టడం ఏంటీ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
Read Also: TDP-Janasena: 11 అంశాలతో టీడీపీ-జనసేన ఉమ్మడిగా మినీ మేనిఫెస్టో
పోలీస్ శాఖలో నేను 26 సవంత్సరాలు పని చేసిన వాళ్ళకే అదే పోలీస్ స్టేషన్ లో నాకే దయనీయమైన పరిస్తితి వచ్చింది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నాపై, నా కొడుకుపై బీఆర్ఎస్ నాయకులు 25 వేల రూపాయలు దోచుకున్నామని తప్పుడు కేసులు పెట్టారు.. ఇక్కడి ఈ మూడు పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని ఆయన ఆరోపించారు. ఎవరికీ ఓటు వేసిన అది బీఆర్ఎస్ కే పోతుంది.. బీఎస్పీ నాయకులపై తప్పుడు ఆరోపణలతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Fire Accident: నాంపల్లి బజార్ ఘాట్ ప్రమాదంపై అగ్నిమాపక శాఖ స్పందన ఇదే..!
ఇక్కడి ఎమ్మెల్యే నియోజక వర్గంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మా బండ్లు, కళా బృందాలను అడుగడుగునా అడ్డుకుంటున్నారు.. బీజేపీ, బీఆర్ఎస్ లు రెండు ఒక్కటే.. మోడీ నిన్నటి మాదిగల విశ్వరూప సభలో మాదిగల మీద మీకు అంతా ప్రేమ ఉంటే మంద కృష్ణ మాదిగను మూఖ్యమంత్రిగా ప్రకటించండి అని ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఎస్పీపై ఉన్న అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి.. లేని పక్షంలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున్న ఆందోళన కార్యక్రమాలు చేపడతాం.. సిర్పూర్ నియోజక ప్రజలకు ఏ సమస్యలున్నా.. బెదిరింపులకు పలుపాల్పడ్డా కాల్ చేయండీ అని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.