NTV Telugu Site icon

RS. 2000 Note Withdrawal: బంగారానికి డిమాండ్‌ పెంచిన రూ.2 వేల నోటు.. క్యాష్‌ చేసుకుంటున్న వ్యాపారులు..!

Gold

Gold

బంగారం ఎప్పుడైనా బంగారమే. ఈ విషయం జనానికి మరో సారి బాగా తెలిసొచ్చింది. దాచుకోడానికి బంగారాన్ని మించిన సాధనం మరొకటి లేదని అర్థమైంది. 2 వేల రూపాయల నోట్లను RBI చెలామణి నుంచి తొలగించడంతో. కరెన్సీ నోట్ల రూపంలో దాచుకోవడం ఎప్పటికైనా ఇబ్బందేనని తెలిసొచ్చింది. మరో నాలుగు నెలల్లో చిత్తు కాగితాలుగా మారిపోబోతున్న 2 వేల రూపాయల నోట్లను బంగారంలోకి మార్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు. 2 వేల నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్టు RBI ప్రకటించిన వెంటనే.. బంగారం షాపులకు ఎంక్వైరీలు మొదలయ్యాయి. తాము తరచూ బంగారం కొనే షాపులకు ఫోన్లు చేసి బంగారం కొనసానడానికి ఆసక్తి కనబర్చారు కొంత మంది. అయితే, 2 వేల రూపాయల నోట్లతో చెల్లింపులు జరుపుతామని చెప్పినట్టు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా గల జువెలరీ షాపులకు ఈ తరహా ఎంక్వైరీలు వెల్లువెత్తాయి.

Read Also: New Ration Card: కొత్త రేషన్ కార్డుల జారీ లేనట్లే.. పౌరసరఫరాల శాఖ క్లారిటీ

2 వేల రూపాయల నోట్లు బంగారంలోకి మార్చుకోడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అయితే, 2016లో నోట్ల రద్దు సమయంలో కనిపించిన ఉధృతి… ఇప్పుడు లేదంటున్నారు జువెలర్స్‌. ప్రస్తుతం దేశంలో 2 లక్షల రూపాయల లోపు బంగారం, వెండి ఆభరణాలు, రత్నాలు కొంటే పాన్, ఆధార్ వంటి పత్రాలను అందజేయాల్సిన అవసరం లేదు. కానీ… 2 వేల నోట్ల మార్పిడి విషయంలో KYC నిబంధనలు కఠినంగా ఉన్నాయి. దీనిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు బంగారం వ్యాపారులు. 2 వేల రూపాయల నోట్లు మార్కెట్లో చెల్లుబాటు కావనే సాకుతో కొంత మంది బంగారు వ్యాపారులు కస్టమర్ల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసినట్టు తెలుప్తోంది. బంగారం కొనుగోలు కోసం 2 వేల రూపాయల నోట్లు ఇచ్చే కస్టమర్ల నుంచి 5 నుంచి 10 శాతం వరకూ అదనంగా వసూలు చేస్తునట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బంగారం ధర తులం 60 వేల 200 మేర ఉంది. కానీ… కొనుగోలు దారుల నుంచి 10 గ్రాముల బంగారాన్ని 66 వేల రూపాయలకు అమ్మినట్టు సమాచారం.

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

గతంలో పెద్ద నోట్ల రద్దుకు… ఇప్పడు 2 వేల రూపాయల నోటు రద్దు మధ్య చాలా వ్యత్సాసం ఉంది. ఈ సారి నోట్లును మార్పిడి చేసుకోడానికి చాలా సమాయం ఇచ్చింది. సెప్టెంబర్‌ 30 వరకూ వాటిని బ్యాంకులో డిపాజిట్‌ చేసుకునే వీలుంది. లేదా బ్యాంకుల్లో వాటిని మార్చుకోడానికి వీలుంది. అయితే, 2 వేల రూపాయల నోట్లకు బదులుగా ఇతర కరెన్సీ నోట్లును తీసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే, 2 వేల రూపాయల నోట్లు పెద్ద మొత్తంలో ఉన్న వాళ్లకు మాత్రం బంగారంలోకి మార్చుకోడానికే ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో బంగారానికి ఒక్క సారిగా డిమాండ్‌ పెరిగిపోయింది. తమ దగ్గర ఉన్న 2 వేల రపాయల నోట్లను మార్చుకోడానికి బంగారం ఒక్కటే సరైననది చాలా మంది భావిస్తున్నారు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న చాలా మంది వ్యాపారులు 2 వేల రూపాయల నోట్ల తో కొనే బంగారం ఆభరణాలకు ఎక్స్ఛేంజి ప్రిమియం విక్రయాలు జరిపారు.