Google Pixel 9 Offers: ‘గూగుల్ పిక్సెల్ 9’ విక్రయాలు ఆరంభం.. 10 వేల రాయితీ!
- ఆగస్టు 14న పిక్సెల్ 9 సిరీస్ రిలీజ్
- ఈరోజు నుంచి విక్రయాలు ఆరంభం
- ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ ఆఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Pixel 9 Launch Offer in Flipkart: మొబైల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘గూగుల్ పిక్సెల్ 9′ సిరీస్ ఫోన్లు ఆగస్టు 14న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మేడ్ బై గూగుల్ ఈవెంట్‌లో విడుదలైన ఈ ఫోన్లకు ఆగస్టు 14 నుంచే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ ఫోన్ల విక్రయాలు ఆరంభం అయ్యాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో వీటిని కొనుగోలు చేయొచ్చు. అలానే క్రోమా, రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటాయి.
పిక్సెల్ 9 సిరీస్‌లో నాలుగు మోడల్‌లు (పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్) ఉన్నాయి. పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ ఫోన్ల విక్రయాలు మాత్రమే నేడు ఆరంభమయ్యాయి. పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ అమ్మకాలు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయని మాత్రం గూగుల్ ఇంకా వెల్లడించలేదు. పిక్సెల్ 9 ఫోన్ 12జీబీ+256జీబీ వేరియెంట్ ధర రూ.79,999గా కంపెనీ నిర్ణయించింది. పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ 16జీబీ+256జీబీ వేరియెంట్ ధర రూ.1,24,999గా ఉంది.
Also Read
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
Also Read: Indra Re Release: ‘అయ్యయ్యయ్యో’ పాటకు పెద్దాయన సూపర్ డాన్స్.. ‘బాస్’ని 100 శాతం మ్యాచ్ చేశాడు!
రిలయన్స్ డిజిటల్‌లో పిక్సెల్ 9ను ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే.. రూ.5,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్‌పై రూ.10,000 వరకు రాయితీ ఉంటుంది. మరోవైపు లాంచ్ ఆఫర్ కింద ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లను కొనుగోలు చేసేవారికి గూగుల్ 30 వాట్స్ పవర్ అడాప్టర్‌ను రూ.1,999కే అందుబాటులో ఉంచింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే.. పిక్సెల్ 9పై రూ.4,000 తక్షణ తగ్గింపు, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్‌పై రూ.10,000 రాయితీ పొందొచ్చు.
తాజావార్తలు
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!