NTV Telugu Site icon

RRR Sequel Update: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సీక్వెల్‌పై అప్‌డేట్‌ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్.. డైరెక్టర్ రాజమౌళి కాదా?

Rrr Sequel

Rrr Sequel

Is SS Rajamouli not to direct RRR Sequel: దాదాపుగా రూ. 1200 కోట్ల వసూళ్లు, పలు అంతర్జాతీయ అవార్డులు సాధించిన తెలుగు చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. గ్లోబల్‌ బాక్సాఫీస్‌పై ఆర్‌ఆర్‌ఆర్‌ సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. వసూళ్లలో రికార్డ్స్ తిరగరాసింది. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్ఠాత్మక పురస్కారం ఆస్కార్‌ కూడా దక్కింది. ఈ అరుదైన క్షణాలను తెలుగు ఫాన్స్ ఇప్పటికీ ఆస్వాదిస్తున్నారు. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌పై ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. తాజాగా రైటర్ విజయేంద్ర ప్రసాద్ సీక్వెల్ గురించి ఓ అప్‌డేట్‌ ఇచ్చారు.

80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ రెడ్ కార్పెట్‌పై డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ… ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్ కోసం స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నామని తెలిపారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను స్క్రీన్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ పంచుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్ హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉంటుందని చెప్పారు. ‘రామ్‌ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఇది హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉంటుంది. ఈ సినిమాని ఎస్ఎస్ రాజమౌళి లేదా అతడి పర్యవేక్షణలో మరొకరు దర్శకత్వం వహిస్తారు’ అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

Also Read: MS Dhoni Run-Out: కోట్లాది మంది భారతీయులు హర్ట్.. విలన్ మార్టిన్ గప్టిల్! వీడియో వైరల్

ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌కు కథ ఇప్పటికే సిద్ధం అయిందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. ఎస్ఎస్ రాజమౌళి లేదా అతడి పర్యవేక్షణలో మరొకరు దర్శకత్వం వహిస్తారు అని రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పడంతో.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌ 2కు డైరెక్టర్ రాజమౌళి కాదా?’ అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా హిట్ కొట్టిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను రాజమౌళి తప్ప ఇంకెవరు తీస్తారని మరికొందరు అంటున్నారు.

మహేశ్‌ బాబుతో ఓ సినిమా చేస్తున్నట్టు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ సినిమా కోసం అమెరికాకు చెందిన క్రియేటివ్‌ ఆర్టిస్ట్స్‌ ఏజెన్సీతో రాజమౌళి ఒప్పందం చేసుకున్నారు. దాంతో ఈ సినిమాకు హాలీవుడ్‌ టెక్నిషియన్లు పని చేస్తారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌ ప్రారంభమవనుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్.. స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ పాత్రలను పోషించారు.

Also Read: Rohit Sharma Captaincy: రోహిత్ శర్మ కెప్టెన్సీ నిరాశపర్చింది.. భారత క్రికెట్ దిగ్గజం అసంతృప్తి!