NTV Telugu Site icon

Kantara : కాంతార ప్రీక్వెల్ కు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఎంట్రీ

New Project 2024 11 03t125033.761

New Project 2024 11 03t125033.761

Kantara : కుందాపూర్‌కి చెందిన రిషబ్ శెట్టి కాలేజీ చదువు ముగించుకుని బెంగళూరుకు వచ్చారు. సినిమాల్లో నటించాలని రిషబ్ కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి నేడు ప్రపంచ ఖ్యాతిని సంపాదించాడు. ప్రస్తుతం ఆయన సూపర్ హిట్ చిత్రం కాంతార ఫ్రీక్వెల్ ఓపెనింగులో ఉన్నారు. కాంతారా సినిమా ఎంతటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకు మించి కాంతార ఫ్రీక్వెల్ తీసుకు రావాలని గట్టిపట్టుదలతో ఉన్నారు. అనుకున్న స్థాయికి చేరుకునేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. అందుకు గాను చాలా మంది రిషబ్ శెట్టితో భుజం భుజం కలిపి పనిచేస్తున్నారు. ఇప్పటికీ.. ఈ చిత్రానికి ఎలాంటి లోటు రాకుండా నిర్మాణ సంస్థ అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. డబ్బు గురించి ఆలోచించకుండా కోట్లకు కోట్లు ఖచ్చు పెడుతున్నారు. సినిమా కోసం రిషబ్‌ శెట్టి ఎవరిని కోరుకుంటున్నారో వారందరినీ హోంబాలే సంస్థ తీసుకెళ్లి కుందాపూర్లో పెడుతుంది. దీనికి మరొక ఉదాహరణ టోడర్ లాజరోవ్.

Read Also:Bangladesh: బంగ్లాదేశ్లో రోడ్డెక్కిన 30 వేల మంది హిందువులు..

అవును, టోడర్ లాజరోవ్. ఆయనో హాలీవుడ్ టెక్నీషియన్. రాజమౌళి దర్శకత్వం వహించిన RRRలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల వెనుక టోడర్ లాజరోవ్ ఉన్నారు. అతని పనిని చూసి రాజమౌళి స్వయంగా ఆశ్చర్యపోయాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన గురించి మాట్లాడి మరీ ప్రశంసించారు. ఇప్పుడు రిషబ్ శెట్టి అదే టోడర్ లాజరోవ్ కోసం వెతికి, తన చిత్రం కాంతారా కోసం బల్గేరియా నుండి కన్నడకు తీసుకువచ్చాడు. ఈ విధంగా కాంతారా చాప్టర్ 1 రెండు ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి. ఈ చిత్రంలో ఈ రెండు యాక్షన్ సన్నివేశాలను టోడర్ లాజరోవ్ దర్శకత్వం వహించనున్నారు. భారీ ఖర్చుతో ఈ రెండు స్టంట్స్‌ను తీయాలని రిషబ్ శెట్టి భావించాడు. ఇంకా సినిమాలోని మరో యాక్షన్ సన్నివేశంలో రిషబ్ శెట్టి పాత్ర కోసం కలరి పయట్టు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఓ ఫోటో షేర్ చేసి ఆసక్తిని రేకెత్తించాడు. ప్రస్తుతం బల్గేరియా నుంచి కుందాపూర్ వచ్చిన టోడర్ లాజరోవ్ దర్శకత్వంలో ఈ కలరిపయట్టు మార్షల్ ఆర్ట్ షూటింగ్ జరుగుతోందా.. లేక ఇప్పటికే ఆ పార్ట్ షూటింగ్ పూర్తయిందా అనేది ఇంకా తెలియదు.

Read Also:Donald Trump: అధికారంలోకి వస్తే వాటి ధరలను తగ్గిస్తా

గతంలో మాదిరిగానే కెరడిలో భారీ సెట్‌ వేసి ప్రీక్వెల్‌ను చిత్రీకరిస్తున్నారు. కుందాపూర్‌లో 22 వేల చదరపు అడుగుల షూటింగ్‌ ఫ్లోర్‌ను నిర్మించి ‘కాంతారా’ చాప్టర్‌-1 షూటింగ్‌ జరుపుకుంటోంది. దానిలోపల నాలుగైదు సెట్లు నిర్మించారు. రూ.1000 కోట్లు వసూళ్లను టార్గెట్ చేసుకుని సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా శరవేగంగా జరుగుతుండగా మరికొద్ది రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి గుమ్మడికాయ పగలగొట్టాలని చిత్రబృందం భావిస్తోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.