Pawan Kalyan Suffering With Viral Fever: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు.. ఫీవర్‌తోనే ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.. ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.. అయితే, గత నాలుగు రోజులుగా వైద్యం చేయించుకుంటున్నా.. జ్వరం తీవ్రత తగ్గలేదు.. దగ్గు ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు పవన్ కల్యాణ్.. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. అందుకోసం ఈ రోజు మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్తనున్నారు పవన్ కల్యాణ్..
Read Also: CM Revanth Reddy: భారీ వర్షాలపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు..
కాగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ ఈ నెల 25వ తేదీన అంటే నిన్నే ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్‌పై దండయాత్ర కొనసాగిస్తోంది. ఓజీ మూవీ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్లు నమోదు చేసినట్టు చెబుతున్నారు.. ఈ మూవీ ఇండియా బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.91 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది అంటున్నరాయి ట్రేడ్ వర్గాలు.. బుధవారం ప్రీమియర్స్ తో పాటు డే1 గురువారం వసూళ్లు కలుపుకుని ఓజీ రూ.91 కోట్ల నెట్ కలెక్ట్ చేసిందంటున్నారు.. ఇక, ఈ మూవీ సూపర్ హిట్ అంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.. అయితే, ఓజీ ఫస్ట్ డే కలెక్షన్స్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..