Virat Kohli-IPL: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Slams 8th IPL Century: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో 7,500 పరుగుల మైలురాయిని అందుకున్న మొదటి క్రికెటర్‌గా విరాట్ నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన విరాట్ ఈ అరుదైన రికార్డు అందుకున్నాడు.
ఇప్పటివరకు 242 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 130.36 స్ట్రైక్ రేట్‌తో 7575 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 7 వేల మార్క్ పరుగులను కూడా మరే బ్యాటర్ చేయలేదు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల రికార్డు విరాట్ పేరిటే ఉంది. టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ 221 మ్యాచ్‌లలో 6754 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 180 మ్యాచ్‌లలో 6545 రన్స్ బాదాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (6280 పరుగులు-246 మ్యాచ్‌లు), మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా (5528 పరుగులు-205 మ్యాచ్‌లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Also Read
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
Also Read: Pawan Kalyan: నేడు అనకాపల్లిలో జనసేన చీఫ్ రోడ్ షో..
రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. కోహ్లీకి ఇది 8వ ఐపీఎల్ సెంచరీ. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు కూడా విరాటే కావడం విశేషం. విరాట్ సెంచరీతో చెలరేగినా.. ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 3 వికెట్లకు 183 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (100 నాటౌట్; 58 బంతుల్లో 9×4, 4×6) చెలరేగడంతో రాజస్థాన్ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
తాజావార్తలు
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!