NTV Telugu Site icon

RR vs MI: దూకుడుతో ఉన్న రాజస్థాన్ ను ముంబై నిలవరిస్తుందా..

Rr Vs Mi

Rr Vs Mi

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఏప్రిల్ 22న జైపూర్‌ లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో టేబుల్ టాపర్స్ రాజస్థాన్ రాయల్స్ (RR) ను ముంబై ఇండియన్స్ (MI) ఢీ కొట్టనుంది. రాజస్థాన్ రాయల్స్, 7 మ్యాచ్‌ లలో 6 గెలిచి, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానంలో ఉండగా.. మరోవైపు ముంబై ఇండియన్స్ తమ 7 మ్యాచ్‌ లలో కేవలం 3 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది.

Also Read: Most Expensive Movies : టాలీవుడ్‌లో రానున్న భారీ బడ్జెట్ సినిమాలు ఇవే..

ఇక ఈ ఇరు జట్లు రాజస్థాన్, ముంబైలు ఇప్పటి వరకు 29 ఐపీఎల్ మ్యాచ్‌ లు జరగగా రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచ్ లు, ముంబై ఇండియన్స్ 15 మ్యాచ్ లు గెలిచాయి. ఇక 1 మ్యాచ్ లో ఎటువంటి ఫలితం రాలేదు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్అత్యధిక స్కోరు 212. రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ అత్యధిక స్కోరు 214. ఇక ఇరుజట్ల ఆటగాళ్ల విషయానికి వస్తే..

Also Read: Bride Kidnap: కంట్లో కారం కొట్టి.. పెళ్లి కూతురును కిడ్నాప్ యత్నం.. వీడియో వైరల్..

ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ XI జట్టులో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (wk), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (c), తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మొహమ్మద్ నబీ, శ్రేయాస్ గోపాల్, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రాలు ఉండవచ్చు. ఇక మరోవైపు..

రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ XI జట్టులో యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (c & wk), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, నాండ్రే బర్గర్ లు ఉండొచ్చు. ఇక ఈ సీజన్ లో వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై పై రాజస్థాన్ 6 వికెట్ల విజయం సాధించింది.

Show comments