NTV Telugu Site icon

WPL 2024: ఈ సాలా కప్‌ నమ్‌దే.. బెంగళూరుదే డబ్ల్యూపీఎల్ కప్‌..

Rcb

Rcb

WPL 2024: విమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో బెంగళూరు జట్టు ఫైనల్‌లో ఘన విజయం సాధించింది. ఢిల్లీపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ 113 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి మందన సేన అలవోకగా విజయం సాధించింది. 1114 పరుగుల లక్ష్యాన్ని  19.3 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.  ఎలిస్ పెర్రీ(35), స్మృతి మందన(31), సోఫి డెవిన్(32) చెలరేగడంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఫైనల్‌లో విజయతీరాలకు చేరింది. ఆర్సీబీ విజయంతో అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ జట్టుకు చెందిన బౌలర్లు మిన్ను మణి, శిఖా పాండేకు తలో వికెట్ దక్కింది. అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టులో.. మెక్‌ లానింగ్(22), షఫాలీ వర్మ(44) మాత్రమే రాణించగలిగారు.  బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4, సోఫి మొలినిక్స్ 3, శోభన ఆశ 2 వికెట్లు తీశారు.

గతేడాది నుంచే డబ్ల్యూపీఎల్‌ ప్రారంభమైంది. 2023లో ముంబై విజేతగా నిలిచింది. బెంగళూరు చివరి ప్లేస్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది మాత్రం బెంగళూరు తన సత్తాను చాటింది. పురుషుల ఐపీఎల్‌లో అబ్బాయిలు ఇప్పటివరకు కప్ కొట్టలేకపోయారు. 2008లో ఐపీఎల్‌ ప్రారంభం కాగా.. 16 సీజన్ల నుంచి బెంగళూరుకు ఒక్క కప్‌  కూడా రాలేదు. అయితే డబ్ల్యూపీఎల్‌లో రెండో సీజన్‌లోనే ట్రోఫిని గెలుచుకోవడం గమనార్హం.