WPL 2024: ఈ సాలా కప్ నమ్దే.. బెంగళూరుదే డబ్ల్యూపీఎల్ కప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WPL 2024: విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో బెంగళూరు జట్టు ఫైనల్లో ఘన విజయం సాధించింది. ఢిల్లీపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ 113 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి మందన సేన అలవోకగా విజయం సాధించింది. 1114 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఎలిస్ పెర్రీ(35), స్మృతి మందన(31), సోఫి డెవిన్(32) చెలరేగడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్లో విజయతీరాలకు చేరింది. ఆర్సీబీ విజయంతో అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ జట్టుకు చెందిన బౌలర్లు మిన్ను మణి, శిఖా పాండేకు తలో వికెట్ దక్కింది. అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టులో.. మెక్ లానింగ్(22), షఫాలీ వర్మ(44) మాత్రమే రాణించగలిగారు. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4, సోఫి మొలినిక్స్ 3, శోభన ఆశ 2 వికెట్లు తీశారు.
గతేడాది నుంచే డబ్ల్యూపీఎల్ ప్రారంభమైంది. 2023లో ముంబై విజేతగా నిలిచింది. బెంగళూరు చివరి ప్లేస్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది మాత్రం బెంగళూరు తన సత్తాను చాటింది. పురుషుల ఐపీఎల్లో అబ్బాయిలు ఇప్పటివరకు కప్ కొట్టలేకపోయారు. 2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా.. 16 సీజన్ల నుంచి బెంగళూరుకు ఒక్క కప్ కూడా రాలేదు. అయితే డబ్ల్యూపీఎల్‌లో రెండో సీజన్లోనే ట్రోఫిని గెలుచుకోవడం గమనార్హం.
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!