Falaknuma: పాతబస్తీలో నడిరోడ్డుపై రౌడీషీటర్ మాస్ యుద్ధీన్ దారుణ హ*త్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Falaknuma: హైదరాబాద్ నగరంలోని ఫలక్‌నుమా ప్రాంతంలో దారుణ హత్య కలకలం రేపింది. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ మాస్ యుద్దీన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఈ హత్య ఘటనకు సంబంధించిన సమాచారం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఇకపోతే, మాస్ యుద్దీన్ మూడురోజుల క్రితమే వివాహితుడయ్యాడు. నూతన జీవితంలో అడుగుపెట్టిన అతడిని అకాల మరణం కలవరిస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.
గుర్తుతెలియని దుండగులు మాస్ యుద్దీన్‌పై కత్తులతో దాడి చేసి అతన్ని అక్కడికక్కడే హతమార్చారు. తీవ్రంగా గాయపడిన యుద్దీన్, రక్తపు మడుగులో చనిపోయాడు. దాడి తీరు చూస్తే.. మృతికి కారణమైన వ్యక్తులు ముందుగానే ప్లాన్ చేసినట్లు అనిపిస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మాస్ యుద్దీన్‌కు కొందరు ప్రత్యర్థులు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అతని ప్రత్యర్థులే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
- WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
- EPFO EDLI Scheme: ఉద్యోగులకు శుభవార్త.. ఒక్క రూపాయి చెల్లించకుండానే రూ.7 లక్షల బీమా..
పోలీసులు సంఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. సమీప సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ, నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ హత్యపై నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా.. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
తాజావార్తలు
-
Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Komatireddy Venkat Reddy : పవన్‌కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
-
CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
-
RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!