టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన గత చిత్రం ‘కింగ్డమ్’ ఫలితంతో ఆయన గ్రాఫ్ డౌన్ అవ్వడంతో.. ఈసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ఒక పక్కా మాస్ యాక్షన్ డ్రామాతో వస్తున్నారు. డైరెక్టర్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ నుండి ఒక ‘సాలిడ్ ట్రీట్’ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు చేసింది. డిసెంబర్ 22న సాయంత్రం 7.29 గంటలకు ఈ సినిమా అఫీషియల్ టైటిల్‌తో పాటు ఒక అదిరిపోయే గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ అప్‌డేట్ విజయ్ అభిమానుల ఆకలి తీర్చడమే కాకుండా, సోషల్ మీడియాను షేక్ చేయడం ఖాయమని మేకర్స్ ధీమాగా ఉన్నారు.
Also Read : Akhanda 2 OTT : నాలుగు వారాల రూల్ ఫిక్స్.. ఓటీటీలో ‘అఖండ 2’ సందడి!
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ‘రౌడీ జనార్థన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే పవర్ ఫుల్ పాత్రలో విజయ్ ఒక డిఫరెంట్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నారని సమాచారం. పాన్ ఇండియా లెవల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ చిత్రం విజయ్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. రేపు సాయంత్రం రాబోయే గ్లింప్స్ వీడియోతో విజయ్ బాక్సాఫీస్ వద్ద తన అసలైన ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ రౌడీ జనార్థన్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే!
