NTV Telugu Site icon

TMC: తమ పార్టీ యువ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళా కౌన్సిలర్..

Tmc

Tmc

తృణమూల్ కాంగ్రెస్ (TMC) కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) కౌన్సిలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె తన పార్టీకి చెందిన యువ నాయకుడిని కొట్టడం కనిపిస్తుంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడంతోనే వివాదం నెలకొంది. ఈ క్లిప్‌ను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో.. వార్డు నంబర్ 18 మహిళా కౌన్సిలర్ సునంద సర్కార్, వార్డు టీఎంసీ యూత్ ప్రెసిడెంట్ కేదార్ దాస్‌ను చెంపదెబ్బ కొట్టడం కనిపిస్తుంది.

Read Also: Kanchanjunga Express Accident: కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై సంచలన నివేదిక..

నివేదికల ప్రకారం.. సునంద సర్కార్ కేదార్ దాస్‌ను కొట్టింది. తాను అనేక దోపిడీ కేసులలో ప్రమేయం ఉందని కేదార్ దాస్ ఆరోపించాడు. దీంతో ఆగ్రహించిన సునంద సర్కార్ ఒక్కసారిగా చెంపదెబ్బ కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని.. సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి ఘటన జరగడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.

Read Also: Pushpa 2 : సుకుమార్- బన్నీ మధ్య ఏం జరుగుతోంది?

మరోవైపు.. భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని అంతర్గత విభేదాల పరిణామంగా అభివర్ణించింది. ఈ ఘటన బెంగాల్‌లో రాజకీయ గందరగోళాన్ని, అంతర్గత కలహాలను ఎత్తిచూపుతుందని తెలిపింది. ‘పార్టీ శ్రేణుల్లోనే బలవంతపు వసూళ్ల ఆరోపణలు వస్తున్నాయి’ అని బీజేపీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. టీఎంసీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఇప్పటికే మసకబారినప్పటికీ విశ్వసనీయతను మరింత దిగజార్చాయని పేర్కొంది. సొంత కౌన్సిలర్లు, సహచరులను అరెస్ట్ చేయాలనే డిమాండ్ పార్టీలో ఉందని తెలిపింది. ఇది తృణమూల్‌లో ముదురుతున్న సంక్షోభాన్ని తెలియజేస్తోందని బీజేపీ పేర్కొంది. మరోవైపు ఈ ఘటనను సీపీఐ (ఎం) పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం ఖండించారు.