కోడి గుడ్డు లేదా ఏదైనా గుడ్డు వృత్తాకారంలో ఉంటాయి.. ఆ ఆకారంలోనే సైజుల్లో తేడా ఉంటుంది.. అయితే ఇప్పటి వరకు గుడ్లను అదే ఆకారంలో చూసాము.. కానీ ఇప్పుడు చెప్పబోయే గుడ్డు మాత్రం గుండు లాగా గుండ్రంగా ఉంటుంది.. అదేంటి అలా కూడా ఉంటాయా అనే సందేహం వస్తుంది కదూ.. అవును అండి.. ఇది నిజం.. ఆ గుండు గుడ్డు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
సాధారణంగా కనిపించే గుడ్డు దాని ప్రత్యేక ఆకారం, పరిమాణం కారణంగా దాని ధర వేలల్లో పలుకుతోంది. ఈ వింత గుడ్డు ఆకారం పూర్తిగా గుడ్రంగా ఉండటం తో దీని ధర, ఆకారణం ఇప్పుడు వార్తలోకెక్కింది. ఒక సాధారణ సూపర్ మార్కెట్లో గుడ్లు కొనుగోలు చేసిన ఒక మహిళ ఈ గుండ్రని గుడ్డును గుర్తించి ఆశ్చర్యపోయింది.. ఆ గుడ్డును వేలంలో పెట్టి మరీ అమ్మింది.. అంతే వేలు వచ్చి పడ్డాయి. వివరాల్లోకి వెళితే..
ఈ విచిత్ర ఘటన ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ని ఒక సూపర్ మార్కెట్లో ఈ గుడ్డును కనుగొన్నారు. మెల్‌బోర్న్‌లోని ఒక సూపర్‌మార్కెట్‌లో జాక్వెలిన్ ఫెల్గేట్ అనే మహిళ కొనుగోలు చేసిన గుడ్లలో ఇది కనిపించింది. దాంతో ఆమె వెంటనే ఈ ప్రత్యేకమైన గుడ్డును ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం తో వార్త వైరల్‌గా మారింది. అయితే, ఇలాంటిది కోట్లలో ఒక్కటి మాత్రమే గుండ్రంగా ఉండే గుడ్డు ఉన్నట్టుగా తెలిసింది… అలాగే గతంలో ఇలాంటి గుడ్డు ఒకటి వేలంలో అమ్ముడు పోయింది.. ఈ మేరకు ఈ గుడ్డు ధర కూడా అంతే ఉండవచ్చునని భావిస్తున్నారు.. ఈ గుడ్డు ను పోస్ట్ చేసిన వ్యక్తి ఈ గుడ్డు ఫోటో తో పాటు గుండ్రంగా ఉండే గుడ్లను దాచిపెట్టి వేలం వెయ్యండి.. లక్షాధికారి అవుతారాని చెప్పింది.. మొత్తానికి ఈ గుండ్రని గుడ్డు ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. మీరు ఓ పారి లుక్ వేసుకోండి..