Simhachalam: విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో అప్పన్న స్వామి భక్తులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సింహాచలంలోని కేశ ఖండన శాలలో పైకప్పు పెచ్చులు కూలిపడ్డాయి. ఆ సమయంలో కేశఖండనం చేయించుకుంటున్న భక్తులు, సిబ్బంది త్రుటిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
Read Also: YS Jagan: పేదలకు మంచి చేయటం కోసం యుద్ధం చేయాల్సి వస్తోంది: సీఎం జగన్
శుక్రవారం కావడంతో భక్తులు తక్కువగా రావడం, మధ్యాహ్నం కావడంతో భక్తులు ఎక్కువగా రాకపోవడంతో, సిబ్బంది కూడా అక్కడ లేకపోవడం వల్ల సురక్షితంగా బయటపడ్డారు. అదే శనివారం, ఆదివారాల్లో జరిగివుంటే ప్రమాదానికి ఎవరు బాధ్యులు?.. అని భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఆలయ అధికారులు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.