Ronin Hero Rat: బొరియలు తవ్వడం కాదు.. బాంబులు పసిగట్టడం దీని స్పెషాలిటీ! గిన్నిస్ రికార్డు సాధించిన ఎలుక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ronin Hero Rat: సాధారణంగా ఎలుకలు కనిపిస్తే మనం భయపడతాం లేదా తరిమికొడతాం. కానీ కంబోడియాలోని ఉత్తర ప్రాంతమైన ‘ప్రీహ విహార్’లో మాత్రం ఒక ఎలుకను అందరూ ‘హీరో’ అని పిలుస్తున్నారు. దాని పేరు ‘రోనిన్’. ఇదొక ‘జెయింట్ ఆఫ్రికన్ పౌచ్డ్ రాట్’ జాతికి చెందిన ఎలుక. ఇది చేస్తున్న పని వింటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. అంతగా ఈ ఎలుక ఏం పని చేస్తుంది, అసలు అది గిన్నిస్ రికార్డును ఎలా సృష్టించింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: MS Dhoni-Rohit Sharma: ముగిసిన ధోనీ, రోహిత్ శకం.. అభిమానుల మదిలో చెరగని ముద్ర!
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
ల్యాండ్మైన్లను పసిగట్టడంలో దిట్ట..
యుద్ధం ముగిసిన దశాబ్దాల తర్వాత కూడా కంబోడియాలో వేల సంఖ్యలో ల్యాండ్మైన్లు అలాగే ఉన్నాయి. వీటి వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడే ‘రోనిన్’ తన అద్భుతమైన స్మెల్ పవర్‌తో రంగంలోకి దిగింది. మెటల్ డిటెక్టర్లతో మనుషులు చేయలేని పనిని రోనిన్ కేవలం నిమిషాల్లోనే పూర్తి చేస్తుంది. పేలుడు పదార్థాల వాసనను పసిగట్టి, మైన్ ఉన్న చోట నేలను గీరుతూ అధికారులను అప్రమత్తం చేస్తుంది. దీని బరువు చాలా తక్కువ కాబట్టి, ఆ బాంబులపైకి వెళ్లినా అవి పేలిపోయే ప్రమాదం ఉండదు.
తాజాగా రోనిన్ అత్యధిక సంఖ్యలో ల్యాండ్మైన్లను గుర్తించి వేల ఎకరాల భూమిని సురక్షితంగా మార్చింది. దీని అసాధారణ ప్రతిభకు గాను ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు లభించగా, తాజాగా ప్రపంచ రికార్డులకెక్కి వార్తల్లో నిలిచింది. గతంలో ‘మగావా’ అనే ఎలుక కూడా ఇదే తరహాలో సేవలు అందించి మరణించగా, ఇప్పుడు ఆ బాధ్యతను రోనిన్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈ ఎలుకలకు ‘APOPO’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. రోనిన్కు చిన్నప్పటి నుంచే పేలుడు పదార్థాల వాసనను గుర్తించడంపై ఈ సంస్థ వారు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పని పూర్తి చేసిన ప్రతిసారి దానికి బహుమతిగా అరటిపండ్లు, వేరుశెనగలను అందిస్తారు. ప్రస్తుతం కంబోడియా ప్రజలకు రోనిన్ ఒక రక్షకుడిగా మారింది. బెల్జియన్ స్వచ్ఛంద సంస్థ APOPO ప్రకారం.. ఆగస్టు 2021 నుంచి రోనిన్ 109 ల్యాండ్మైన్లను, 15 ఇతర పేలని ఆయుధ సామగ్రిని (UXO) కనుగొంది. దీంతో ఈ ఎలుక అత్యధిక ల్యాండ్మైన్లను కనుగొన్న ఎలుకగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!