Ronald Rose : ఏపీకి కాదు… రోనాల్డ్ తెలంగాణలోనే..! సీనియర్ ఐఏఎస్ అధికారికి ఊరట..
- డీఓపీటీ నిర్ణయాన్ని తిరస్కరించిన క్యాట్
- రోనాల్డ్ రోస్‌కు ఊరట
- ఏపీలో రిపోర్ట్ చేసినా.. తెలంగాణలోనే కొనసాగించాలని కోరిన సీనియర్ ఐఏఎస్
Ronald Rose : సీనియర్ ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రోస్‌కు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (CAT) పెద్ద ఊరట ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినప్పటికీ, ప్రస్తుతం ఆయన తెలంగాణలోనే కొనసాగేలా అవకాశం కల్పిస్తూ క్యాట్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన అనంతరం కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (DoPT) రోనాల్డ్ రోస్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఆయన ఏపీలో రిపోర్ట్ చేసినా, తర్వాత కొన్ని కారణాలతో మళ్లీ తెలంగాణకు రాగా, తిరిగి ఇటీవల తన బదిలీపై రోనాల్డ్ క్యాట్‌ను ఆశ్రయించారు.
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
తనకు తెలంగాణ రాష్ట్రంలో సేవల కొనసాగింపునకు అవకాశం కల్పించాలని, DoPTను ఆదేశించాలని కోరుతూ రెండోసారి క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారించిన ట్రైబ్యునల్ తాజాగా రోనాల్డ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నిబంధనలను పరిశీలించిన అనంతరం, రోనాల్డ్ రోస్‌కు తెలంగాణలో కొనసాగేందుకు అనుమతినిచ్చేలా DoPTకు ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా రోనాల్డ్ రోస్‌కు సర్వీసులో కొనసాగే మార్గం సులభమైంది.
ఈ పరిణామం ప్రస్తుతం తెలంగాణ పాలన వ్యవస్థలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. విభజన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపులు అనేక వివాదాలకు దారి తీసిన సందర్భంలో, ఈ కేసు మరో మలుపు తీసుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
Manchu Manoj: కన్నప్ప సినిమాకు భైరవం పోటీ.. ఇదెప్పుడు జరిగింది?
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?