హిట్ మ్యాన్‌గా పేరొందిన రోహిత్ శర్మకు ఏమైంది.. 2024 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచినప్పటి నుండి అతను సరిగా ఆడటం లేదు.. దీంతో.. తన బ్యాట్‌కు ఏదో ఒక శాపం తగిలి ఉంటుందని క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తీవ్ర నిరాశ పరిచిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత రంజీలో ఆడాడు. అక్కడ కూడా ఇదే రకమైన ప్రదర్శన కనబరిచాడు. అయితే.. వన్డే క్రికెట్‌లో అతని బ్యాట్ నుండి పరుగులు రావాలని అభిమానులు ఆశించినప్పటికీ మరోసారి నిరాశపరిచాడు. ఈరోజు నాగ్‌పూర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 7 బంతుల్లో 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
Read Also: CM Rvanth Reddy : ఢిల్లీకి సీఎం రేవంత్.. ఆనందంలో ఆశావాహులు.. ఈ సారి కేబినెట్ విస్తరణ ఖాయ’మే’నా..!
249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ క్రీజులోకి వచ్చారు. అయితే.. యశస్వి వికెట్ పడిపోవడంతో రోహిత్ శర్మ జాగ్రత్తగా ఆడాలని ప్రయత్నించాడు. అయితే.. శకీబ్ మహమూద్ బౌలింగ్‌లో లియామ్ లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చాడు. రోహిత్ శర్మ బంతిని ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించగా.. అది గాలిలోకి లేచింది. దీంతో.. మరోసారి రోహిత్ ముఖంలో నిరాశ, విరక్తి స్పష్టంగా కనిపించాయి.
Read Also: Cheating: రియల్ ఎస్టేట్‌లో భారీ నష్టాలు.. రూ.20 కోట్లు టోకరా..!
రోహిత్ శర్మ గడిచిన 10 ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా 20 పరుగులు దాటలేకపోయాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌లలో అతను కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. అయితే తర్వా.. రంజీ ట్రోఫీలో అతను కొంతమేర ఫామ్ లోకి వస్తాడని భావించినప్పటికీ, వన్డే క్రికెట్‌లో అతని ఫామ్ ఏం మాత్రం మార్చుకోలేదు. గత 16 ఇన్నింగ్స్‌లలో రోహిత్ శర్మ కేవలం 166 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 10.37గా ఉంది. కాగా.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకి ఇది ఆందోళన కలిగించే విషయం. దీంతో.. రోహిత్ శర్మ ఫామ్ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.. ఈ రెండు మ్యాచ్‌ల్లో పుంజుకుని ఫామ్ లోకి వస్తాడా.. లేదంటే ఇలాగే నిరాశ పరుస్తాడా అనేది చూడాలి.