Site icon NTV Telugu

Rohit Sharma: హిట్ మ్యాన్ ఖాతాలో వరల్డ్ రికార్డు..

Rohit Sharma Historic Milestone

Rohit Sharma Historic Milestone

Rohit Sharma: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి ODIలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రెండు సిక్సర్లు కొట్టి, క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడు ODI క్రికెట్ చరిత్రలో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ODIలలో ఓపెనర్‌గా క్రిస్ గేల్ మొత్తం 328 సిక్సర్లు (274 ఇన్నింగ్స్‌లలో) కొట్టాడు. కానీ ఇప్పుడు రోహిత్ శర్మ ఈ రికార్డును అధిగమించాడు. అతను 329 సిక్సర్లు కొట్టి, ODI క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా నయా చరిత్రను లిఖించాడు.

READ ALSO: Polavaram : రేపు సుప్రీం కోర్టులో పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై విచారణ..!

ODI లలో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును సొంతం చేసుకున్న క్రిస్ గేల్ 274 ఇన్నింగ్స్‌లలో మొత్తం 328 సిక్సర్లు కొట్టాడు. కానీ రోహిత్ 191 ఇన్నింగ్స్‌లలో 329 సిక్సర్లు కొట్టి, ODI క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా నయా రికార్డు సృష్టించాడు. నిజానికి ఇది క్రిస్ గేల్ చేసిన ఇన్నింగ్స్‌లలో సగం మాత్రమే. తాజా మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్‌లో మొత్తం 29 బంతులు ఎదుర్కొని, 3 ఫోర్లు , 2 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు.

వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన స్టార్స్..

రోహిత్ శర్మ – 329
క్రిస్ గేల్ – 328
సనత్ జయసూర్య – 263
మార్టిన్ గుప్టిన్ – 174
సచిన్ టెండూల్కర్ – 167

READ ALSO: Women Rule: ఈ దేశంలో పురుషులందరూ బానిసలే..

Exit mobile version