Rohit Sharma Attends ENG vs IND 5th Test at The Oval ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లండన్‌లోని ఓవల్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్ట్‌కు టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ హాజరయ్యాడు. మూడో రోజైన శనివారం ఆటను చూసేందుకు రోహిత్ ఓవల్ మైదానానికి వచ్చాడు. ఈరోజు ఆట ఆరంభమైన గంట తర్వాత హిట్‌మ్యాన్ స్టేడియంలోకి వచ్చాడు. వీఐపీ గ్యాలరీ నుంచి మ్యాచ్‌ను వీక్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇంగ్లండ్ పర్యటనకు ముందే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు టీ20 క్రికెట్‌కు సైతం వీడ్కలు చెప్పాడు. ప్రస్తుతం హిట్‌మ్యాన్ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2025 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ పేలవ ప్రదర్శన చేశాడు. గత రెండేళ్లుగా టెస్ట్‌ల్లో రోహిత్ పెద్దగా రన్స్ చేయలేదు. దాంతో టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ ఒత్తిడి చేసిందని, అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడని నెట్టింట వార్తలు వచ్చాయి. రోహిత్ రిటైర్మెంట్ విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర కీలకం అని న్యూస్ వినిపిస్తున్నాయి.
Also Read: IND vs ENG: భారత్‌ది కూడా ‘బజ్‌బాల్’ ఆటే.. బిత్తరపోయిన ఇంగ్లండ్ ప్లేయర్స్! ఆధిక్యం 166
భారత్ 52 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 221 రన్స్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ బాదాడు. జైస్వాల్ సహా కరుణ్ నాయర్ 9 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఆకాష్ దీప్ (66) హాఫ్ సెంచరీ బాదాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (11) నిరాశపరిచాడు. భారత్ ప్రస్తుతం 200 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా 150 పరుగులు చేస్తే భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కరుణ్ మంచి ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. జడేజా, జురెల్, సుందర్ ఉన్న నేపథ్యంలో భారత్ భారీ స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ROHIT SHARMA AT THE OVAL TO SUPPORT TEAM INDIA. 🇮🇳 pic.twitter.com/qSqe5q3D8z
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 2, 2025
ROHIT SHARMA HAS ARRIVED AT THE OVAL TO SUPPORT TEAM INDIA. 🇮🇳pic.twitter.com/kmo3O9bRjl
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 2, 2025