ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఈ సీజన్ లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ ముందు ఇదొక మంచి పరిణామం అని చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అందుకోసం అన్ని దేశాలు సమయాత్తమవుతున్నాయి. ఈ మెగా టోర్నీని దక్కించుకునేందుకు అన్ని దేశాల ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.
Aa Okkati Adakku: పెళ్లి కాని వాళ్ళ పెయిన్ ఫీలయ్యి సినిమా చేశా.. డైరెక్టర్ ఇంటర్వ్యూ
టీ20 ప్రపంచకప్ జూన్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎంపికపై సెలక్టర్లు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అయితే.. జట్టులో రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఉండాల్సిందేనని కెప్టెన్ రోహిత్ శర్మ సెలక్షన్ కమిటీకి తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. అతడి స్వభావం ఈ మెగా టోర్నీలో టీమిండియాకు కలిసి వస్తుందని రోహిత్ చెప్పారట. మే 1తో జట్టు ప్రకటన గడువు ముగియనుంది. దీంతో ఈరోజు లేదా రేపు జట్టు ప్రకటించే అవకాశముంది.
Yarlagadda Venkatarao: ఉంగుటూరు మండలంలో యార్లగడ్డ ప్రచార హోరు..
ఆర్సీబీ తరుఫున ఆడుతున్న కింగ్ కోహ్లీ.. ఈ ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ముందంజలో ఉన్నాడు. ఆర్సీబీ తరుఫున కోహ్లీ ఒక్కడే ఇప్పటివరకు అద్భుతంగా రాణించాడు. అంతేకాకుండా.. ఒక సెంచరీ కూడా నమోదు చేశాడు. తన దూకుడు ఆటతీరుతో టీ20 వరల్డ్ కప్ లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మరోవైపు.. అటు టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అద్భుతంగా ప్రదర్శన చేస్తున్నాడు.