Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: ఐపీఎల్ 2027కు ముందే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ట్రేడ్ డీల్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ట్రేడ్‌లో భాగంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్ జట్టులోకి వెళ్లగా.. స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఈ పరిణామంతో ముంబై జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది. ముఖ్యంగా 5 సార్లు ఐపీఎల్ టైటిల్ అందించిన రోహిత్ శర్మ మరోసారి ముంబై పగ్గాలు చేపడతాడా? అనే ఆసక్తి నెలకొంది.
హార్దిక్ పాండ్యా గత మూడు సీజన్లుగా ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు అతడు జట్టును వీడటంతో కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో యువ ఆటగాడు తిలక్ వర్మ, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ముంబైకి 5 ఐపీఎల్ టైటిళ్లు అందించిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వైపే అందరి దృష్టి ఉంది.
Also Read
- Virat Kohli: చిన్నారి ప్రశ్నకు విరాట్ సమాధానం.. ఆర్యవీర్ సెహ్వాగ్‌కు కోహ్లీ ఇచ్చిన సలహా ఇదే..
- వైభవ్ నుండి సూర్యకుమార్ వరకు.. స్టార్ క్రికెటర్ల సందడి..! SMAT 2026లో 34 జట్ల వివరాలు ఇవే..
- Fertiliser Subsidy for Rabi: రైతులకు కేంద్రం భారీ శుభవార్త.. గతేడాది కంటే 64 శాతం పెంపు
- Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
తాజాగా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హామిల్టన్‌లో వర్షం కారణంగా మూడో వన్డే రద్దయిన తర్వాత రోహిత్ న్యూజిలాండ్ ఆటగాళ్లను కలిశాడు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్‌ను రోహిత్ పలకరిస్తూ.. ‘హలో మిచీ’ అని అన్నాడు. అందుకు శాంట్నర్ ‘హలో కెప్టెన్’ అంటూ సమాధానమిచ్చాడు. ఇక్కడే అసలు చర్చ మొదలైంది. రోహిత్ ప్రస్తుతం భారత జట్టుకు కానీ, ముంబై ఇండియన్స్‌కు కానీ కెప్టెన్‌గా లేడు. అయినప్పటికీ శాంట్నర్ అతడిని కెప్టెన్ అని సంబోధించడంతో సోషల్ మీడియా యూజర్లు నానా హంగామా చేస్తున్నారు. వచ్చే ఐపీఎల్ సీజన్లో రోహిత్ మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. శాంట్నర్ మాటలను బట్టి కెప్టెన్సీ మార్పు ఖాయమని చెప్పలేం.
మరోవైపు హార్దిక్ పాండ్యా రూ.18 కోట్ల ఒప్పందంతో పంజాబ్ కింగ్స్ జట్టులో చేరనున్నాడు. గతంలో ముంబై తరఫున అతడికి రూ.16.35 కోట్ల పారితోషికం లభించేది. 2015లో ముంబై జట్టులో చేరిన హార్దిక్ 2015, 2017, 2019, 2020 సీజన్లలో టైటిల్ విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఏడు సీజన్ల పాటు ముంబై తరఫున ఆడిన అతడు 2022లో గుజరాత్ టైటాన్స్‌కు మారాడు. ఆ జట్టుకు తొలి సీజన్లోనే కెప్టెన్‌గా టైటిల్ అందించాడు. 2023లోనూ గుజరాత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. 2024లో తిరిగి ముంబైకి వచ్చి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్లో 162 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ 146.28 స్ట్రైక్ రేట్‌తో 2,955 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 82 వికెట్లు పడగొట్టాడు. ఇక అర్ష్‌దీప్ సింగ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్ తరఫున 96 మ్యాచ్‌లు ఆడి 111 వికెట్లు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పుడు అతడు ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు.
తాజావార్తలు
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
India Tax Collection: దేశంలో భారీగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. రూ.14.42 లక్షల కోట్లకు చేరిన నికర ఆదాయం
-
India New Visa Rules 2026: భారత్‌లో కొత్త వీసా రూల్స్.. 70 శాతం తగ్గనున్న అప్లికేషన్ ఫారాలు, 13 నుంచి 9కి కేటగిరీలు!
-
Virat Kohli: చిన్నారి ప్రశ్నకు విరాట్ సమాధానం.. ఆర్యవీర్ సెహ్వాగ్‌కు కోహ్లీ ఇచ్చిన సలహా ఇదే..
-
వైభవ్ నుండి సూర్యకుమార్ వరకు.. స్టార్ క్రికెటర్ల సందడి..! SMAT 2026లో 34 జట్ల వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..