Rohit Sharma: భారత క్రికెట్ జట్టు ఇటీవల టెస్టు క్రికెట్‌లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిన సంగతి తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ఓటమి, అలాగే ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలుపుకోలేకపోవడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత ప్రదర్శన కూడా తివారంగా నిరాశపరిచింది. ముఖ్యంగా, ఆసీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేయడం అతడి బ్యాటింగ్ ఫామ్‌పై మరింత ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో, రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడా? అతని స్థానంలో కొత్త కెప్టెన్‌ను ఎవరిని ఎంపిక చేస్తారు? అనే ప్రశ్నలు ఉత్కంఠ రేగాయి. అయితే, ఆసీస్ సిరీస్ ముగిసిన వెంటనే రోహిత్ టెస్టులకు గుడ్‌బై చెప్పడం ఖాయమనే వార్తలు వినిపించగా.. టెస్ట్ లలో తన భవిష్యత్తుపై ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు.
Read Also: Jammu and Kashmir: ఏప్రిల్ 1 నుంచి మహిళలకు ఉచితంగా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణం
ఇకపోతే ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత జూన్‌లో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్‌తోనే కొత్త ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2025-27) కూడా మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌కు ఎవరు కెప్టెన్‌గా వ్యవహరిస్తారన్న ప్రశ్న అందరిలోను ఉంది. నిజానికి ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ఓటమి అనంతరం రోహిత్ శర్మ తన భవిష్యత్తు గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా, ‘తాను మరికొంతకాలం ఆడతానని మాత్రమే చెప్పాడు.
Read Also: IML 2025 Final: ఫైనల్ చేరిన వెస్టిండీస్.. టైటిల్ కోసం భారత్తో అమితుమీ
అయితే, తాజగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలవడం రోహిత్ కెప్టెన్సీకి మరోమారు ఫుల్ మర్క్స్ పడ్డాయి. ఈ విజయంతో బీసీసీఐ అతడిని మరికొంతకాలం భారత జట్టు కెప్టెన్‌గా కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఏమి చేయగలడో చేసి చూపించాడని, ఇంగ్లాండ్ పర్యటనలో కూడా జట్టును అతడే నడిపించడానికి అతడే సరైన అభ్యర్థని భావిస్తున్నట్లు సమాచారం. దీనితో రోహిత్ ఖచ్చితంగా టీమిండియా టెస్ట్ బాధ్యతలను స్వీకరిస్తాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయం అనంతరం, రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. తాను వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దని, నేను ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకోవడం లేదని అతడు తెలిపాడు. మొత్తంగా.. రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్సీ భవిష్యత్తుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌తో రాబోయే టెస్టు సిరీస్‌కు అతడే కెప్టెన్‌గా ఉంటాడా? లేక కొత్త నాయకత్వాన్ని చూడాల్సి వస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.