NTV Telugu Site icon

T20 World Cup 2024: ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లపై రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్..

Rohit Sharma

Rohit Sharma

అమెరికా, వెస్టిండీస్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024లో భారత జట్టు వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికాతో టైటిల్‌ మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చేశారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ జోడీ మొత్తం 6 వికెట్లు పడగొట్టింది. దీంతో.. సెమీస్‌లో భారత్ ఏకపక్షంగా విజయం సాధించగలిగింది. మ్యాచ్ గెలిచిన తర్వాత ఇంగ్లండ్‌పై టీమ్ ప్లాన్ గురించి భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

Amartya Sen: భారత్ హిందూదేశం కాదు.. లోక్‌సభ ఎన్నికలనే నిదర్శనం..

మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. అక్షర్, కుల్దీప్ గొప్ప స్పిన్నర్లు.. ఇక్కడి పిచ్ పరిస్థితుల్లో కొన్ని షాట్లు ఆడడం కష్టం. మరీ ముఖ్యంగా స్పిన్ బౌలింగ్లో ఆడటం కష్టమని చెప్పాడు. స్పిన్ బౌలర్లపై నమ్మకంతో తాను ప్రశాంతంగా ఉన్నానని రోహిత్ శర్మ తెలిపాడు. వారు ఎలాంటి బౌలింగ్ చేస్తారో తెలుసన్నారు. అయితే.. తమ బ్యాటింగ్ ముగియగానే.. బౌలింగ్ ఎలా చేయాలనేదానిపై చర్చించుకున్నట్లు రోహిత్ శర్మ చెప్పారు. మీకు వీలయినంత ఎక్కువగా స్టంప్స్ మీద బౌల్ చేయండి.. స్టంప్‌ను లక్ష్యంగా చేసుకోండని బౌలర్లకు సూచించినట్లు తెలిపాడు.

Leopard: కుక్క కోసం వచ్చి బోనులో చిక్కిన చిరుత

విజయం తర్వాత.. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లను రోహిత్ శర్మ ప్రశంసించాడు. సెమీ ఫైనల్‌లో అక్షర్ పటేల్ భారత్‌కు తొలి విజయాన్ని అందించాడు. అర్ష్‌దీప్ వేసిన ఒకే ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టి ప్రమాదకరంగా కనిపించిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌కు అక్షర్ పెవిలియన్ దారి చూపించాడు. ఆ తర్వాత మొయిన్ అలీ, బెయిర్‌స్టో లాంటి కీలక వికెట్లు పడగొట్టాడు. మరో ఎండ్‌ నుంచి కుల్‌దీప్‌ యాదవ్‌ కూడా ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టాడు. అక్షర్ 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. కుల్దీప్ 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి.