Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరువనంతపురంలో వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత, భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టు హోటల్‌కు తిరిగి వస్తున్న సమయంలో టీమ్ బస్సు దిగుతుండగా రోహిత్ ప్రమాదవశాత్తు జారిపడ్డారు. అదృష్టవశాత్తు రోహిత్ శర్మకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
కేరళ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఛేజింగ్, కుల్దీప్ యాదవ్ మాయాజాలం వల్ల భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 30న జరగనుంది. అయితే మ్యాచ్ అనంతరం హోటల్ వద్ద బస్సు దిగుతున్న సమయంలో రోహిత్ కాలుజారి పడిపోయిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అయింది. బస్సు మెట్లు దిగుతున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా జారి కిందపడగా, అక్కడే ఉన్న వలంటీర్లు వెంటనే స్పందించి రోహిత్‌ను సురక్షితంగా లేపారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే విరాట్ కోహ్లీ చాలా ఆందోళన చెందారు. రోహిత్‌కు చేతికి గాని లేదా ఇతర ప్రాంతాల్లో గాయాలు కాలేదని నిర్ధారించుకునే వరకు ఆయన వైపే శ్రద్ధగా చూస్తూ అంతా సవ్యంగా ఉందో లేదో అని పరిశీలించారు.
Also Read
- Anthropic CEO: 10 ఏళ్లలో క్యాన్సర్ లేని ప్రపంచం.. ఏఐపై భారీ అంచనాలు..
- Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. మ్యూజియం, మెట్రో సహా అభివృద్ధి పనులకు రూ.77,101 కోట్లు
- Jammu Kashmir: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి..
- Hardik Pandya: పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీపై హార్దిక్ క్లారిటీ.. జట్టు సారథి ఎవరో చెప్పేసిన పాండ్యా..
Rohit Sharma 𝗦𝗹𝗶𝗽𝗽𝗲𝗱 from the Bus 😱
While returning to the hotel after winning the first ODI against the West Indies, Rohit Sharma slipped badly on the stairs of the team bus. 😥
– Everyone was celebrating India’s win, but Virat Kohli was 𝘀𝘁𝘂𝗻𝗻𝗲𝗱 to see Rohit. 😭 https://t.co/T01Lf4tJsb
— Mukku (@Cric_Mukku) September 28, 2026
మరోవైపు.. మ్యాచ్‌లో రోహిత్ ప్రదర్శనపై ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఇయాన్ బిషప్ ప్రశంసలు కురిపించారు. రోహిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారని, ఇన్నింగ్స్ ప్రారంభించిన తీరు అత్యద్భుతంగా ఉందని కొనియాడారు. అయితే.. అంత తేలికైన బంతికి అలా ఔట్ కావడం పట్ల రోహిత్ స్వయంగా అసంతృప్తి చెంది ఉంటారని తెలిపారు. అలాగే భవిష్యత్తుపై తన ఆలోచనలను పంచుకుంటూ, రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచ కప్ గురించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన క్రికెట్ ప్రయాణం ముగిసిందనే ఆలోచన తన మనసులోకి రాదని, ఆడుతున్నంత కాలం ఎదురుచూడదగ్గ విషయాలు చాలా ఉంటాయని తెలిపారు. రాబోయే ప్రపంచ కప్ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రోహిత్ స్పష్టం చేశారు. ఐసీసీ టోర్నమెంట్లు ఆడేటప్పుడు ప్రతిసారీ సరికొత్త సవాళ్లు ఎదురవుతాయని, ప్రత్యర్థులు, వేదికలు మారుతుంటాయి కాబట్టి అందుకు తగినట్లుగానే భిన్నమైన ఆలోచనలతో సిద్ధం కావాల్సి ఉంటుందని ఆయన వివరించారు.
తాజావార్తలు
-
Anthropic CEO: 10 ఏళ్లలో క్యాన్సర్ లేని ప్రపంచం.. ఏఐపై భారీ అంచనాలు..
-
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. మ్యూజియం, మెట్రో సహా అభివృద్ధి పనులకు రూ.77,101 కోట్లు
-
Priya Bhavani Shankar Wedding: సైలెంట్‌గా ఏడడుగులు వేసిన హీరోయిన్.. 10 ఏళ్ల ప్రేమకు శుభం కార్డు!
-
Jammu Kashmir: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి..
-
Hardik Pandya: పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీపై హార్దిక్ క్లారిటీ.. జట్టు సారథి ఎవరో చెప్పేసిన పాండ్యా..
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!