NTV Telugu Site icon

Rohit Sharma: రోహిత్ ఇంట్రెస్టింగ్ వీడియో.. 99% వర్కౌట్ టైమ్.. ఆ 1% అలా..

Rohith

Rohith

Rohit Sharma Viral Video: తాజాగా భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తనలో ఉన్న మరో కోణాన్ని తన అభిమానులకు పరిచయం చేసాడు. రోహిత్ తన వ్యాయామ సమయంలో 99% తాను కష్టపడతానని.. అయితే, మిగిలిన 1% మాత్రం తన చేష్టలతో సహచరులను ఇబ్బంది పెట్టే విధంగా ఓ సరదా వీడియోను షేర్‌ చేశాడు. ఇకపతే ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌ లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన తర్వాత.. తాను అంతర్జాతీయ టి20 ఫార్మాట్‌ కు రోహిత్‌ వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే.

Rohit Sharma-MI: ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసినట్లే!

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తాజాగా షేర్‌ చేసిన ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ గా మారింది. అది ఎంతలా అంటే కేవలం 4 గంటల్లోనే అది11 లక్షల లైకులు దక్కించుకొంది. జిమ్‌ లో రోహిత్‌ శర్మ సీరియస్‌.. సరదా కోణాలను ఈ వీడియోలో చూపించారు. రోహిత్ శర్మ ఇన్‌స్టాలో చేసిన వీడియో 99% – 1% అంటూ వైరల్‌ అవుతూ ఉంది. ఇక ఈ వీడియో మొదట్లో రోహిత్ శర్మ రన్నింగ్‌, లెగ్‌ ప్రెస్‌, టైర్‌ ఫ్లిప్‌ వ్యాయామాలు చేస్తూ ఉండడాన్ని చూపించారు. ఇక చివరలో హిట్‌ మ్యాన్‌ సరదాగా జిమ్‌ కు వచ్చే తన సహచరులను ఆట పట్టించడం, ముచ్చట్లు పెట్టుకోవడం లాంటివి ఉన్నాయి. దింతో ఈ వీడియో బాగా వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు పెద్దెత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను ఇక్కడ చూసేయండి.

Show comments