బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. శుక్రవారం నుంచి పెర్త్‌లో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదు. ఈ విషయాన్ని రోహిత్ శర్మ బీసీసీఐకి తెలియజేసాడు. అతను ఇటీవలే రెండోసారి తండ్రైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తన కుటుంబంతో కొంత సమయం గడపాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. కాగా.. రోహిత్ గైర్హాజరీలో జట్టు వైస్ కెప్టెన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు. డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో ప్రారంభమయ్యే రెండో మ్యాచ్‌కి ముందు రోహిత్ టీమిండియాలో చేరతాడు. అతను రెండో టెస్టు మ్యాచ్‌లో ఆడనున్నాడు.
Read Also: Pushpa 2 Trailer: పుష్ప అంటే పేరు కాదు.. పుష్ప అంటే బ్రాండ్.. పుష్ప 2 ట్రైలర్ వచ్చేసిందోచ్
రోహిత్ స్థానంలో దేవదత్ పడిక్కల్ జట్టులోకి:
రోహిత్ గైర్హాజరు కారణంగా ఇండియా ఎ జట్టుతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న దేవదత్ పడిక్కల్‌ను ఆస్ట్రేలియాలోనే ఉండాలని భారత సెలక్టర్లు కోరారు. పెర్త్‌లోని ఓపస్ స్టేడియంలో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రోహిత్ స్థానంలో 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో పడిక్కల్‌ను చేర్చారు.
మరోవైపు.. శనివారం మ్యాచ్ సిమ్యులేషన్ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు శుభ్‌మాన్ గిల్ బొటనవేలికి గాయమైంది. ఈ క్రమంలో.. భారత బ్యాటింగ్ లైనప్‌లో ఖచ్చితంగా మార్పులు జరిగే అవకాశం ఉంది. గిల్ మొదటి టెస్ట్‌కు దూరంగా ఉండనున్నాడు.. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌కు జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. మరోవైపు.. రోహిత్ గైర్హాజరీలో వికెట్ కీపర్ ధృవ్ జురైల్‌కు పూర్తిగా బ్యాట్స్‌మెన్‌గా అవకాశం లభించవచ్చు. ఆస్ట్రేలియా Aతో జరిగిన రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో 80, 64 పరుగులు చేయడం ద్వారా జురైల్ తనను తాను నిరూపించుకున్నాడు.