బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. శుక్రవారం నుంచి పెర్త్‌లో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదు. ఈ విషయాన్ని రోహిత్ శర్మ బీసీసీఐకి తెలియజేసాడు. అతను ఇటీవలే రెండోసారి తండ్రైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తన కుటుంబంతో కొంత సమయం గడపాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. కాగా.. రోహిత్ గైర్హాజరీలో జట్టు వైస్ కెప్టెన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు.