NTV Telugu Site icon

IND vs NZ: డ్రెస్సింగ్ రూమ్‌లో రిషబ్ పంత్‌ను తిట్టిన రోహిత్ శర్మ.. వీడియో

Rishab Rohit

Rishab Rohit

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. కాగా.. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 18 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. ఇదిలా ఉంటే.. కెప్టెన్సీ మాత్రం బాగానే చేశాడు. ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్, బౌలింగ్ వైవిధ్యాలతో న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌ను 235 పరుగులకు ఆలౌట్ చేశారు.

Read Also: Shocking Video: భర్త చనిపోయిన బెడ్‌ను ఐదు నెలల గర్భిణితో శుభ్రం చేయించిన ఆస్పత్రి సిబ్బంది..

కాగా.. మొదటి రోజు డ్రెస్సింగ్ రూమ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. రోహిత్ శర్మ రిషబ్ పంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు.. ఏదో చెబుతున్నట్లు కనిపిస్తున్నాడు. వీడియోలో ఆ మూమెంట్ చూస్తే.. పంత్‌ను రోహిత్ శర్మ తిట్టినట్లుగా కనిపిస్తోంది. అయితే.. వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో తెలియదు కానీ.. రోహిత్ శర్మ రిషబ్ పంత్‌పై ఏదో విషయంలో కోపంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

Read Also: IMD Alert: దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ

తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఫెయిల్ అయినప్పటికీ.. రిషబ్ పంత్ (60) పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరో బ్యాటర్ శుభమాన్ గిల్ 90 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసి న్యూజిలాండ్‌పై 28 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది.

Show comments