Site icon NTV Telugu

Rohit Sharma: గతాన్ని పట్టించుకోము.. రేపటి మ్యాచ్పైనే ఫోకస్

Rohit

Rohit

Rohit Sharma: ఈ వరల్డ్ కప్లో టీమిండియా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఆడిన లీగ్ మ్యాచ్ల్లో టీమిండియా అన్నింటిలో గెలిచింది. ఇక రేపు ఇండియా-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్ మ్యాచ్.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనుంది. అయితే గత వరల్డ్ కప్ లో సెమీస్ లో టీమిండియాను న్యూజిలాండ్ జట్టు ఓడించిన సంగతి తెలిసిందే. అయితే ఆ భయం ఇంకా అభిమానుల మనుస్సుల్లో మెదులుతూనే ఉంది.

Read Also: PM Modi: “మూర్ఖులకు రాజు”.. రాహుల్ గాంధీ ‘మేడ్ ఇన్ చైనా’ వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్..

తాజాగా అ అంశంపై.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ పై టీమిండియా ట్రాక్ రికార్డు ఏమంత బాగాలేదన్న విషయంపై స్పందించాడు. గత వరల్డ్ కప్ లో టీమిండియా, న్యూజిలాండ్ చేతిలో ఓటమి విషయాన్ని మర్చిపోవాలని అన్నాడు. గతంలో ఏం జరిగిందని కాదు.. గతం గురించి పట్టించుకోమన్నాడు. తమ ఫోకస్ అంతా రేపటి మ్యాచ్ పైనే అని తెలిపాడు. ఇదిలా ఉంటే.. ఐసీసీ ఈవెంట్లలో ఇప్పటివరకు టీమిండియా-న్యూజిలాండ్ 13 సార్లు తలపడంది. వాటిల్లో న్యూజిలాండ్ దే పైచేయి ఉంది. చూడాలి మరీ రేపు జరగబోయే మ్యాచ్ లో ఏ జట్టుపై ఏ జట్టు విజయం సాధించి ఫైనల్ కు చేరుతుందో.

Read Also: Chiranjeevi: జవాన్ పాటకు చిరు స్టెప్స్.. ఆ గ్రేస్ ను ఎవరు కొట్టలేరు అంతే

Exit mobile version