NTV Telugu Site icon

Rohit Sharma: అహ్మదాబాద్ పిచ్ ను పరిశీలించిన రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ

Rohit Sharma

Rohit Sharma

రేపు ఆహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాలో భారత్ తుది పోరుకు సిద్ధమైంది. ఇరవై ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. లీగ్ దశ నుంచి ఫైనల్‌ వరకు వరుస విజయాలతో ముందుకు సాగిన రోహిత్‌ సేన.. చివరి పోరులోనూ అజేయంగా నిలవాలనే సంకల్పంతో ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కంగారూలతో పోటీకి అస్త్రశస్త్రాలను రెడీ చేసుకున్నారు. ప్రత్యర్థ టీమ్ బలాలు, బలహీనతలను బేరిజు వేసుకుంటూ దానికి తగ్గట్లుగా తమను తాము రెడీ చేసుకుంటుంది టీమిండియా. ఈ నేపథ్యంలో భారత జట్టు నిన్న ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంది.

Read Also: Satyavathi Rathod: సత్యవతి రాథోడ్ పై కేసు నమోదు.. కారణం అదే అంటున్న పోలీసులు

ఈ సందర్భంగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్, ఇషాన్‌ కిషన్, ప్రసిధ్‌ కృష్ణ, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్, ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్, బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్, బౌలింగ్‌ కోచ్‌ పారస్‌ మాంబ్రే అహ్మదాబాద్ గ్రౌండ్ కి వచ్చారు. ఆ తర్వాత కొంతసేపు రోహిత్‌ క్యాచింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. ఆ తర్వాత రోహిత్‌, ద్రవిడ్‌తో కలిసి అహ్మదాబాద్‌ పిచ్‌ను పరిశీలించాడు. బీసీసీఐ క్యూరేటర్లు ఆశిష్‌ భౌమిక్‌, తపోష్‌ ఛటర్జీ సహా స్థానిక క్యూరేటర్‌ జయేశ్‌ పటేల్‌తో కాసేపు మాట్లాడారు.

Read Also: Tragedy: హైదరాబాద్‌లో విషాదం.. నాలుగేళ్ల కూతురికి ఉరేసి దంపతులు ఆత్మహత్య

కాగా, ప్రపంచకప్‌-2023 లీగ్‌ దశలో భాగంగా దాయాది టీమ్స్ భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ నరేంద్ర మోడీ స్టేడియంలోనే జరిగింది. ఆ టైంలో ఇక్కడ బ్లాక్‌ సాయిల్‌తో కూడిన పిచ్‌ను రూపొందించనున్నారు. భారత్‌- ఆస్ట్రేలియా ఫైనల్‌ మ్యాచ్ కు కూడా ఇదే రకమైన పిచ్‌ను వాడనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు చెందిన పిచ్‌ క్యూరేటర్‌ ఈ కామెంట్స్ చేశారు. ఇక, ఐసీసీ వర్గాలు మాట్లాడుతూ.. ఐసీసీ పిచ్‌ కన్సల్టెంట్‌ ఆండీ అట్కిన్సన్‌ ఇండియాలోనే ఉన్నా.. గానీ, ‍గ్రౌండ్‌ను పరిశీలించలేదు. అయితే, ఇవాళ అందుబాటులో ఉంటారని తెలుస్తుంది.