టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా తడబడుతోంది. ఇటీవలే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, అంతకుముందు టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత్.. టెస్ట్ క్రికెట్‌లో విఫలమవుతుంది. 2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 3-1 తేడాతో ఓటమి చవిచూసింది. అంతకు ముందు.. భారత్ స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. దీంతో.. టీమిండియా 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుండి నిష్క్రమించింది.
Read Also: Pak Vs NZ: పాకిస్తాన్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్..
ఈ క్రమంలో.. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టెస్ట్ క్రికెట్‌లో మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మార్పులకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని గంగూలీ చెప్పారు. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌లో ఇంకా మెరుగ్గా ఆడగలడని అన్నారు. “గత 4-5 సంవత్సరాలుగా రోహిత్ శర్మ రెడ్ బాల్‌తో ఆడిన ప్రదర్శన నాకు ఆశ్చర్యకరంగా ఉంది. అతను ఇంకా బాగా ఆడగలడు. రోహిత్ శర్మ తన ఆలోచనలను మార్చుకుని.. ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి” అని గంగూలీ చెప్పారు.
Read Also: Ranya Rao: దర్యాప్తులో షాకింగ్ విషయాలు.. స్నేహితుడితో దుబాయ్‌కు 26 ట్రిప్పులు
గంగూలీ మాట్లాడుతూ, “ఇంగ్లాండ్‌తో 5 టెస్టులు ఆడాలి.. అది కఠినమైన సిరీస్ అవుతుంది. టీమిండియాకు రెడ్ బాల్‌తో రోహిత్ శర్మ ప్రదర్శన చాలా అవసరం. వైట్ బాల్‌తో, అతను అన్ని ఫార్మాట్లలో గొప్ప ఆటగాళ్లలో ఒకడు” అని గంగూలీ అన్నారు. “ప్రస్తుతం భారత జట్టు రెడ్ బాల్‌తో బాగా ఆడటం లేదు, ఈ విషయం మీద దృష్టి పెట్టాలి. ఇంగ్లాండ్‌లో బాగా ఆడటానికి రోహిత్ శర్మ దారి చూపించాలి. ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్ భారత క్రికెట్‌కు చాలా కీలకమైంది” అని తెలిపారు.
టెస్ట్ సిరీస్ షెడ్యూల్
మొదటి టెస్ట్: జూన్ 20 నుండి జూన్ 24 – హెడింగ్లీ, లీడ్స్
రెండో టెస్ట్: జూలై 2-6 – ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
మూడో టెస్ట్: జూలై 10-14 – లార్డ్స్, లండన్
నాల్గవ టెస్ట్: జూలై 23-27 – ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
ఐదవ టెస్ట్: జూలై 31 నుండి ఆగస్టు 4 – కెన్నింగ్టన్ ఓవల్, లండన్