Rohit Sharma: వైభవ్ సూర్యవంశీకి కారు డ్రైవింగ్ ఇవ్వను.. రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రస్తుతం మైదానానికి దూరంగా ఉంటూ బుల్లితెరపై హోస్ట్‌గా సందడి చేస్తున్నారు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత తదుపరి న్యూజిలాండ్ సిరీస్‌కు చాలా సమయం ఉండటంతో సోనీ టీవీలో వస్తున్న ‘ఫ్యామిలీ ఫుల్ హౌస్’ అనే టీవీ షోను ఆయన నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే పలువురు క్రికెటర్లు విచ్చేయగా, త్వరలోనే విరాట్ కోహ్లీ కూడా హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ షోలో రోహిత్ శర్మ 15 ఏళ్ల భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై చేసిన సరదా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
షో సందర్భంగా “మీరు కొత్త కార్ కొంటే, ఏ క్రికెటర్‌కు ఆ కారును అసలు డ్రైవింగ్ చేయడానికి ఇవ్వరు?” అని రోహిత్ శర్మను ప్రశ్నించారు. గతాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన రిషభ్ పంత్ పేరు చెప్తారని అందరూ భావించారు. కానీ హిట్ మ్యాన్ చాకచక్యంగా ఆలోచించి 15 ఏళ్ల చిన్న వయస్కుడైన వైభవ్ సూర్యవంశీ పేరును చెప్పారు.
Also Read
- IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి మరో ఛాన్స్.. కానీ మూడో టీ20లో కొత్త ట్విస్ట్!
- Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
- Arshdeep Singh: వైట్ బాల్ స్టార్ టు రెడ్ బాల్ స్పెషలిస్ట్.? టెస్టు అరంగేట్రానికి రంగం సిద్ధం..! బౌలింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు..
- Harmanpreet Kaur History: 37 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. వన్డేల్లో మొదటి బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్ చరిత్ర!
మరోవైపు న్యూజిలాండ్ సిరీస్‌లో భాగంగా వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీ20 అరంగేట్రం చేసిన తర్వాత చాలా కాలంగా ఆయన బెంచ్‌కే పరిమితమవుతున్నారు. వరల్డ్ కప్ గెలిచిన ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్, అభిషేక్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉండటంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మ్యాచ్ లైనప్‌ను మార్చేందుకు ఇష్టపడలేదు. అయితే ప్రస్తుతం వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ గాయపడటంతో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో ఆడే ఛాన్స్ లభించనుంది. ఈ క్రమంలో ఆయన ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడా లేక మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
తాజావార్తలు
-
IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి మరో ఛాన్స్.. కానీ మూడో టీ20లో కొత్త ట్విస్ట్!
-
Instagram Reels on TV: ఇన్స్టాగ్రామ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఇకపై మొబైల్ స్క్రీన్ కాదు.. నేరుగా టీవీలోనే రీల్స్..
-
దొంగచాటుగా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన Anthropic Claude AI.. ప్రభుత్వ డేటాబేస్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలు..
-
ZP Chairman Election: కోనసీమ కూటమిలో కొత్త ట్విస్ట్.. జనసేన అభ్యర్థిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె!
-
Software Engineer S*uicide: ‘పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా’.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్చన ఆత్మహత్య.!
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!