NTV Telugu Site icon

Kohli-Rohit: విరాట్ కోహ్లీతో పోస్టర్.. రోహిత్‌ శర్మ ఫ్యాన్స్ ఫైర్!

Kohli Rohit

Kohli Rohit

భారత్-న్యూజీలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆరంభం అయింది. నవంబర్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. గతంలో రెండుసార్లు టీమిండియా ట్రోఫీ దక్కించుకోవడంతో.. ఈసారి ఆసీస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ట్రోఫీకి సంబంధించి ఆస్ట్రేలియా మీడియా ‘ఫాక్స్‌ క్రికెట్’ విశ్లేషణలతో కూడిన ఓ వీడియోను, పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అయితే బార్మీ ఆర్మీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు.. భారత అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

ఇంగ్లండ్‌కు చెందిన బార్మీ ఆర్మీ తన పోస్టులో విరాట్ కోహ్లీని హైలైట్‌ చేసింది. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం కింగ్ కోహ్లీ వస్తున్నాడంటూ పేర్కొంది. కోహ్లీని హైలైట్‌ చేస్తూ ఉండటంపై రోహిత్ శర్మ ఫ్యాన్స్‌ ఫైర్ అవుతున్నారు. రోహిత్‌ కెప్టెన్‌గా ఉన్నప్పుడు అతడిని పక్కనపెట్టడం సరైంది కాదంటూ ఫాన్స్ కామెంట్లు వచ్చాయి. ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌ అధికారిక ఫ్యాన్‌ గ్రూప్‌ అయిన బార్మీ ఆర్మీ ఇలాంటి పోస్టులను గతంలోనూ చాలాసార్లే పెట్టింది.

Also Read: Akhanda 2: మాస్‌ కాంబోలో నాలుగో చిత్రం.. ఈసారి ‘అఖండ’ తాండవమే!

ఆస్ట్రేలియా గడ్డపై గత రెండుసార్లు విరాట్ కోహ్లీ నాయకత్వంలోనే భారత్ సిరీస్‌లు గెలుచుకుంది. ఈసారి మాత్రం రోహిత్ శర్మ సారథ్యంలో ఆడనుంది. కానీ ఆసీస్‌ మీడియా మాత్రం రోహిత్‌ను కాకుండా ఇంకా కోహ్లీనే సారథిగా భావిస్తున్నట్లుగా వీడియోకు హెడ్డింగ్‌ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఫాక్స్ క్రికెట్‌ పెట్టిన వీడియో థంబ్‌నైల్‌లో కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టును పెట్టడం గమనార్హం. సీనియర్‌ క్రికెటర్లు అజింక్య రహానే, చేటేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ కూడా ఉన్నారు. రాబోయే సిరీస్‌కు రోహిత్ నాయకత్వం వహిస్తున్నాడని, కోహ్లీతో థంబ్‌నైల్‌ పెట్టడం బాగాలేదని హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

Show comments