Rohit Sharma: నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. రోహిత్ శర్మ ముందు మూడు రికార్డులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Eye on AB de Villiers Sixes Record: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. తనకు అచ్చొచ్చిన మెగా టోర్నీలో మరోసారి పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్న రోహిత్.. టీమిండియాకు అద్భుత విజయాలు అందిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో 442 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ తన చివరి మ్యాచ్‌ను ఆదివారం నెదర్లాండ్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు హిట్‌మ్యాన్‌ను మూడు రికార్డులు ఊరిస్తున్నాయి.
నెదర్లాండ్స్ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మను రెండు సిక్సర్ల రికార్డులు ఊరిస్తున్నాయి. ప్రపంచకప్ 2023 ముందు వరకు ఒక క్యాలెండర్ ఇయర్లో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. 2015లో వన్డేల్లో ఏబీ 58 సిక్సర్లు బాదాడు. రోహిత్ ఈ ఏడాది ఇప్పటివరకు వన్డేల్లో 58 సిక్సర్లు బాది డివిలియర్స్ రికార్డును సమం చేశాడు. మరో సిక్సర్ బాదితే.. వన్డే చరిత్రలో ఒక ఏడాది అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ నిలుస్తాడు.
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
Also Read: Iceland Earthquakes: 14 గంటల వ్యవధిలో 800 భూప్రకంపనలు.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ఐస్లాండ్!
మరో ఐదు సిక్సర్లు బాదితే ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డు బద్దలు రోహిత్ శర్మ కొడతాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సులు బాదిన జాబితాలో 49 సిక్సర్లతో గేల్ అగ్ర స్థానంలో ఉన్నాడు. 45 సిక్సర్లతో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుత రోహిత్ జోరు చూస్తుంటే ఈ రికార్డును నెదర్లాండ్స్‌పైనే తన ఖాతాలో వేసుకోనున్నాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచకప్ టోర్నీలలో 25 మ్యాచులాడి 1420 పరుగులు చేశాడు. మరో 80 పరుగులు చేస్తే.. 1500 పరుగుల క్లబ్‌లోకి ఎంటర్ అవుతాడు. ఈ ఘనత సాధించిన ఐదో బ్యాటర్‌గా రోహిత్ రికార్డు నెలకొలుపుతాడు. ఈ జాబితాలో రోహిత్ కన్నా ముందు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర, విరాట్ కోహ్లీ ఉన్నారు.
- Tags
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!