Rohit Sharma Dance: బావమరిది పెళ్లిలో భార్యతో కలిసి రోహిత్ శర్మ డ్యాన్స్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Dance: వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వన్డేలో భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీతో హార్దిక్ పాండ్యా కెప్టెన్ పగ్గాలు చేపట్టాడు. మొదటి వన్డే నుంచి వైదొలగిన రోహిత్.. తన బావమరిది పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. పెళ్లి వేడుకలో రోహిత్, తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వేదికపై భార్య రితికా సజ్దేతో కాలు కదుపుతున్నట్లు కనిపించాడు. బాలీవుడ్ పాట ‘లాల్ ఘాగ్రా’కు భారత కెప్టెన్ డ్యాన్స్ చేసిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గురువారం రాత్రి జరిగిన వేడుకలో రోహత్ శర్మ భార్య రితికాతో కలిసి ఎంజాయ్ చేశాడు. ఇందులో రోహిత్ పాములా చేతులు కదుపుతూ భార్యతో కలిసి స్టెప్పులు వేశాడు. ఆ తర్వాత భార్యపై డబ్బుల కురిపిస్తున్న చేతులు ఆడిస్తూ సరదాగా కనిపించాడు. ఈ వీడియోపై నెటిజన్లతో పాటు అభిమానులు కూడా తెగ ఇష్టపడుతున్నారు. రోహిత్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
Read Also: IND VS AUS: టాస్ గెలిచిన టీమిండియా.. బౌలింగ్ ఎంచుకున్న పాండ్యా
రెగ్యులర్ కెప్టెన్ లేకపోవడంతో హార్దిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్సీ పాత్రను స్వీకరించిన హార్దిక్ పాండ్యా తనను తాను తెలివైన కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు. గతంలో రోహిత్ శర్మ గైర్హాజరీలో వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా అద్భుతంగా రాణించాడు. చివరి రెండు వన్డేలకు రోహిత్ తిరిగి వస్తాడని భావిస్తున్నారు. అంతకుముందు, అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గవ టెస్టులో వెన్నులో గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ వన్డే సిరీస్‌కు దూరంగా ఉండటంతో భారత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. పేస్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో పేస్ డిపార్ట్‌మెంట్‌కు కూడా పరీక్ష జరగనుంది. అతను గాయంతో చాలా కాలం పాటు సైడ్‌లైన్‌లో ఉన్నాడు. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, యువ ఆటగాడు ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా భారత్‌లో వన్డే ప్రపంచకప్‌లో తమ స్థానాలను పదిలపరచుకోవాలని చూస్తున్నారు.
Rohit Sharma's dance at his brother-in-law's marriage. pic.twitter.com/TTqalgeQH2
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2023
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!