రోహిత్ శర్మ.. హిట్ మ్యాన్ గా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఎంతోమంది అభిమానుల ను మనసులను గెలిచాడు. ఇకపోతే ఆంతర్జాతీయ క్రికెటర్స్ వారి కెరియర్ లో భాగంగా విదేశాలకు వెళ్లి క్రికెట్ ఆడాల్సిన పరిస్థితి. ఒక్కో దేశంలో కొరకమైన స్టేడియమ్స్ ఉంటాయి. దాంతో ఒక్కో దేశంలో ఒక్కో ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే టీమిండియా ఆటగాళ్లు వేరే దేశాలకు వెళ్లి క్రికెట్ ఆడాల్సిన సమయంలో అక్కడ ఉన్న క్రికెట్ అభిమానుల నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది. కాకపోతే., ఏ దేశంలో అయినా సరే వారి హోమ్ గ్రౌండ్స్ లో వారి దేశ ప్రజలు ఎక్కువగా సపోర్ట్ చేస్తారు. కొన్ని సమయాల్లో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవని.. ఎలాంటి మంచి క్రికెటర్ అయినా సరే ప్రేక్షకుల నుండి తీవ్ర వ్యతిరేకత, ట్రోల్ల్స్, విమర్శలు కూడా వస్తుంటాయని వాటిని ఎదుర్కోవడం కష్టమంటూ తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
Also Read: Nagarjuna Sagar: డెడ్ స్టోరేజ్ కి నాగార్జునసాగర్ నీటిమట్టం.. సాగునీటి విడుదలకు నో ఛాన్స్..?!
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు కలిగిన రోహిత్ శర్మకు ఓ స్టేడియంలో మ్యాచ్ ఆడాలంటే మనకు పుడుతుందట. ఇంతకీ అది ఏ దేశంలో ఉంది..? ఏ స్టేడియం..? అసలు ఎందుకు భయం..? లాంటి విషయాలు ఒకసారి చూద్దాం. ఆస్ట్రేలియాలోని చారిత్రాత్మక గ్రౌండ్ మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్. అక్కడ మ్యాచ్ ఆడాలంటే రోహిత్ శర్మకు ఫీజులు అవుట్ అవుతాయని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ స్టేడియంలో అత్యంత భయానకరమైనదిగా ఎంసిజి గ్రౌండ్ ను చెప్పవచ్చు అంటూ రోహిత్ మాట్లాడుతూ.. అక్కడ తాము బాక్సింగ్ డే టెస్ట్ ఆడమని అయితే ఆ గ్రౌండ్ లో కుడివైపు ఉన్నారంటే చాలా అద్భుతమైన అనుభూతిని కలుగుతుందని., కాకపోతే.. అదే వేరే సైడ్ ఉంటే మాత్రం తమకి చుక్కలు చూపిస్తూ.. లైఫ్ ను నరకంగా మార్చేస్తానంటూ రోహిత్ వాపోయాడు.
Also Read: Heroine Namitha: హీరోయిన్ సంచలన నిర్ణయం.. తిట్టిపోస్తున్న ఫ్యాన్స్..!
అయితే మెల్ బోర్న్ గ్రౌండ్లో క్రికెట్ ఆడటం అంటే తనకి చాలా ఇష్టం అని తెలపడం కోస మెరుపు. ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ సంబంధించిన విషయాలు కూడా రోహిత్ శర్మ పాలుపంచుకున్నాడు. తాను ఇప్పట్లో ఎలాంటి రిటైర్మెంట్ ప్లాన్ ఆలోచించలేదని., తాను కచ్చితంగా వరల్డ్ కప్ నెగ్గింతవరకు టీంలో ఉండడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలియజేశాడు.
