NTV Telugu Site icon

Rohit Sharma: రిటైర్‌మెంట్‌పై మౌనం వీడిన రోహిత్

Rohit

Rohit

Rohit Sharma On Retirement: సిడ్నీ టెస్ట్‌కు దూరంగా కూర్చోవడం అంటే తాను రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు కాదని టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. దీనితో పాటు, తన పేలవమైన ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని సిడ్నీ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. తన నిర్ణయాన్ని మ్యాచ్‌కు ఒక రోజు ముందు కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు చెప్పానని తెలిపాడు. దాంతో సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

Also Read: IND vs AUS: విజృంభించిన టీమిండియా బౌలర్లు.. ప్రతిఘటిస్తున్న ఆసీస్ బ్యాటర్స్

ఇక సిడ్నీ టెస్ట్ రెండో రోజు లంచ్ విరామంలో రోహిత్ మీడియా సమావేశంలో పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు. సిడ్నీ టెస్టు నుంచి తాను విశ్రాంతి తీసుకోవడమే కానీ, క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం లేదని ఆయన స్పష్టం చేశాడు. జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నానని రోహిత్ వెల్లడించాడు. పెర్త్ టెస్టులో కేఎల్ రాహుల్ – యశస్వి జైస్వాల్ జోడీ అద్భుతంగా ఆడి డబుల్ సెంచరీ భాగస్వామ్యం సాధించి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిందని రోహిత్ పేర్కొన్నాడు. ఆ జోడీని మార్చకూడదనే ఉద్దేశంతో, అలాగే కేఎల్ రాహుల్ ఫామ్‌ కూడా మెరుగ్గా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. ఫామ్‌లో లేని ప్లేయర్లతో కీలకమైన మ్యాచ్‌లు ఆడించడం జట్టు ప్రయోజనాలకు అనుకూలం కాదని భావించామని, ఇది చాలా సున్నితమైన నిర్ణయం అంటూ తెలిపాడు. కానీ జట్టు ప్రయోజనాలే నాకు ముఖ్యమైనవని రోహిత్ పేర్కొన్నాడు.

Also Read: Donald Trump: హష్ మనీ కేసులో జనవరి 10న కోర్టుకు ట్రంప్.. శిక్ష విధిస్తామని తెలిపిన కోర్టు

మీడియాలో వస్తున్న డ్రెస్సింగ్ రూమ్‌లో సమస్యల వార్తలను రోహిత్ ఖండించాడు. మనస్పర్థల గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, అలాంటి ప్రచారాన్ని నియంత్రించడం మన చేతుల్లో లేదని తెలిపాడు. జట్టులో అందరూ బాగా కలిసిమెలసి ఉంటున్నారని రోహిత్ చెప్పుకొచ్చాడు. అలాగే తన ఫామ్ హురించి మాట్లాడుతూ.. ఇప్పుడు నేను ఫామ్‌లో లేకపోవచ్చు, కానీ.. రాబోయే ఐదు నెలల్లో కూడా పరుగులు చేయలేనని ఎవరూ చెప్పలేరు. ఫామ్ కోసం నిరంతరం శ్రమిస్తా. ఎవరో ల్యాప్‌ట్యాప్, పేపర్, పెన్‌ పట్టుకొని నా రిటైర్మెంట్‌ గురించి నిర్ణయం తీసుకోలేరని కాస్త మీడియాపై ఘాటుగానే స్పందిచాడు. నేను ఇద్దరు పిల్లల తండ్రిని, నాకు ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలుసునని రోహిత్ పేర్కొన్నాడు. అలాగే మైదానంలో కొన్‌స్టాస్, బుమ్రాల మధ్య జరిగిన వాగ్వాదంపై మాట్లాడుతూ.. మా కుర్రాళ్లు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటారు. ఎవరైనా రెచ్చగొడితే, వారు స్లెడ్జింగ్‌కు తగిన విధంగా స్పందిస్తారని రోహిత్ సున్నితంగా సమాధానమిచ్చాడు. ఈ స్పష్టతతో రోహిత్ శర్మ తన రిటైర్మెంట్‌ పుకార్లకు తెరదించడంతో పాటు జట్టు సమైక్యత విషయంలో కూడా స్పష్టం చేసాడు.

Show comments