Rohit Sharma Enjoys With Friends: తనకొచ్చిన విరామాన్ని భారత కెప్టెన్ రోహిత్ శర్మ సరదాగా గడుపుతున్నాడు. కుటుంబం, స్నేహితులతో కలిసి ఫుల్ చిల్ అవుతున్నాడు. హిట్‌మ్యాన్ తన స్నేహితులైన భారత మాజీ క్రికెటర్ ధావల్ కులకర్ణి, టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌లతో కలిసి ఆదివారం ముంబైలోని ఓ రెస్టారంట్‌కు వెళ్లాడు. అక్కడ అందరూ భోజనం చేశారు. ఇందుకు సంబందించిన పోటోలను ధావల్ కులకర్ణి తన ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి.
Also Read: Duleep Trophy 2024: అందుకే నన్ను దులీప్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు: రింకు సింగ్
రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మెగా టోర్నీ అనంతరం భారత జట్టు జింబాబ్వే, శ్రీలంకతో సిరీస్‌లు ఆడింది. లంక పర్యటనలో టీ20 సిరీస్‌ను గెలుచుకున్న భారత్.. వన్డే సిరీస్‌ను 2-0తో కోల్పోయింది. శ్రీలంక స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడంలో రోహిత్ సేన విఫలమైంది. రోహిత్ 3 మ్యాచ్‌ల్లో 157 పరుగులు చేసి సిరీస్‌లో హైయెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో భారత్ టెస్ట్ సిరీస్‌ను ఆడనుంది. ఆపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది.
Aamcha asach चालतं 🥙☕️🍳 pic.twitter.com/Jl6mfbHng3
— Dhawal Kulkarni (@dhawal_kulkarni) August 18, 2024
