Site icon NTV Telugu

Vijay Hazare Trophy: సెంచరీతో రోహిత్ శర్మ ఊచకోత.. ముంబై భారీ విజయం..!

Rohit Sharma

Rohit Sharma

Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) గ్రూప్ C మ్యాచ్‌లో ముంబై (Mumbai) జట్టు భారీ విజయం సాధించింది. జైపూర్‌లో నేడు జరిగిన ఈ మ్యాచ్‌లో సిక్కిం‌ (Sikkim)ను 8 వికెట్ల తేడాతో ఓడించి ముంబై భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్ శర్మకు దక్కింది. టాస్ గెలిచిన సిక్కిం మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీనితో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 236 పరుగులు చేసింది.

649cc లిక్విడ్ కూల్డ్ పారలల్ ట్విన్ ఇంజన్, కొత్త ఫీచర్లు, టెక్నాలజీతో 2026 Kawasaki Ninja 650 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!

సిక్కిం ఇన్నింగ్స్ లో అశీష్ థాపా 79 పరుగులు (87 బంతులు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అలాగే వారి ఇన్నింగ్స్ లో సాయి సత్విక్ 34, క్రాంతి కుమార్ 34, రాబిన్ లింబూ నాటౌట్‌గా 31 పరుగులు సాధించారు. ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు, శంస్ ములానీ, ముషీర్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఇక 237 పరుగుల ఓ మాదిరి లక్ష్యంతో బరిలో దిగిన ముంబై జట్టు 30.3 ఓవర్లలోనే 2 వికెట్లకు 237 పరుగులు చేసి 117 బంతుల మిగిలి ఉండగా గెలిచింది.

90Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో బడ్జెట్ సెగ్మెంట్‌లో HMD Pulse 2 లాంచ్‌కు సిద్ధం..!

ముంబై ఇన్నింగ్స్ లో ఓపెనర్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్ తో అభిమానులకు వింటేజ్ రోహిత్ గుర్తుకు వచ్చాడు. రోహిత్ 94 బంతుల్లో 155 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు హిట్ మ్యాన్. ఇక ముంబై ఇన్నింగ్స్ లో అంగ్క్రిష్ రఘువంశి 38 పరుగులు చేసి అవుట్ కాగా.. ముషీర్ ఖాన్ 27, సర్ఫరాజ్ ఖాన్ 8 పరుగులు అజేయంగా నిలిచి టీంకు విజయాన్ని అందించారు. సిక్కిం బౌలర్లలో అంకుర్ మాలిక్, క్రాంతి కుమార్ తలో వికెట్ తీశారు.

Exit mobile version