NTV Telugu Site icon

Rohit Sharma Catch: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో రోహిత్ స్టన్నింగ్ క్యాచ్! వీడియో చూసి తీరాల్సిందే

Rohit Sharma Catch

Rohit Sharma Catch

Rohit Sharma Single Hand Catch: కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. మిడాఫ్‌లో ఊహించని క్యాచ్‌ను హిట్‌మ్యాన్‌ అందుకున్నాడు. రోహిత్ గాల్లోకి ఎగిరి మరీ ఒంటిచేత్తో క్యాచ్‌ను అందుకున్న తీరును చూసి.. బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ సహా భారత ఆటగాళ్లు సైతం నోరెళ్లబెట్టారు. రోహిత్ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 50వ ఓవర్‌ను మహమ్మద్ సిరాజ్ వేశాడు. సిరాజ్ వేసిన నాలుగో బంతికి లిటన్ దాస్ ముందుకు వచ్చి షాట్‌ ఆడాడు. మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ తల మీదుగా బంతి దూసుకెళుతోంది. రోహిత్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. లిటన్ దాస్ అయితే షాక్ అయ్యాడు. టీమిండియా ప్లేయర్స్ అయితే నోరెళ్లబెట్టారు. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ తన చేతులను తలపై పెట్టుకుని ఆశ్చర్యపోయాడు. తాను పట్టిన క్యాచ్‌ను హిట్‌మ్యాన్‌ కూడా నమ్మలేకపోయాడు. క్యాచ్ పట్టగానే సంతోషంలో పరుగులు చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ అయింది.

Also Read: Hyundai Record: అరుదైన మైలురాయిని అందుకున్న హ్యుందాయ్‌!

నాలుగో రోజు లంచ్‌ బ్రేక్ సమయానికి బంగ్లాదేశ్‌ 6 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మొమినల్ హక్ (102 నాటౌట్) సెంచరీ బాదాడు. 93, 95 పరుగుల వద్ద క్యాచ్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ హక్.. తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని శతకం పూర్తి చేసుకున్నాడు. మెహిదీ హసన్ మిరాజ్ (6) క్రీజులో ఉన్నాడు. అశ్విన్, ఆకాష్ తలో రెండు వికెట్స్ పడగొట్టారు. గత రెండు రోజులు ఒక్క బంతి పడకుండానే ఆట రద్దైన సంగతి తెలిసిందే.

Show comments